News July 7, 2024
T20 WC: ఐసీసీ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు బ్రేకింగ్ వ్యూస్

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత తమ డిజిటల్ ఛానల్స్‌లో రికార్డు బ్రేకింగ్ వ్యూస్ వచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. 24 గంటల్లో అన్ని వేదికల్లో కలిపి 1.3 బిలియన్ వ్యూస్ సాధించినట్లు తెలిపింది. భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఈ ఫైనల్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొంది. జూన్ 29న జరిగిన ఉత్కంఠ పోరులో టీమ్‌ఇండియా 7 రన్స్ తేడాతో గెలిచి WCని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 8, 2025
MIDHANIలో 210 పోస్టులు.. అప్లై చేశారా?

మిశ్రమ ధాతు నిగమ్(MIDHANI)లో 210 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE, బీటెక్, ITI, డిప్లొమా అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. ITI ట్రేడ్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9,600, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు.
News December 8, 2025
విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారా?

శ్రీవారితో పాటు ఆలయ గోపురంపై ఉన్న విమాన వేంకటేశ్వరుడికీ అంతే ప్రత్యేకత ఉంటుందని చాలామంది భక్తులకు తెలిసుండదు. తిరుమలకు వెళ్లినవారు ఇరువురినీ తప్పక దర్శించుకోవాలని <<18475056>>పురోహితులు<<>> సూచిస్తున్నారు. ఆనంద నిలయంపై వాయవ్య మూలన వెండి మకర తోరణంతో ఉన్న మందిరంలో శ్రీవారి మూలమూర్తిని పోలిన విమాన వేంకటేశ్వరుడి విగ్రహం ఉంటుంది. 16వ శతాబ్దంలో వ్యాస తీర్థులు ఈ విగ్రహం వద్ద ధ్యానం చేసి మోక్షం పొందారని ప్రతీతి.
News December 8, 2025
వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ భాగం: గవర్నర్

TG: 2047 వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ‘లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోంది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఆవిష్కరణల్లో ముందంజలో ఉంది. 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందని నమ్మకం ఉంది. లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్‌తో పనిచేస్తోంది’ అని చెప్పారు.


