News April 30, 2024
T20WC: వికెట్ కీపర్ల ఎంపికలో మల్లగుల్లాలు!

టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్టును ప్రకటించడంలో బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. బ్యాటింగ్‌లో లెక్కకు మించిన క్రికెటర్లు మంచి ఫామ్‌లో ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వికెట్ కీపర్లు పంత్, రాహుల్, శాంసన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరికి తోడు ఇషాన్ కూడా ఉన్నారు. హార్దిక్ పాండ్య ఎంపిక సెలక్టర్లకు సవాల్‌గా మారింది. కాగా WC జట్ల ప్రకటన గడువు రేపటితో ముగియనుంది.
Similar News
News December 10, 2025
డిసెంబర్ 10: చరిత్రలో ఈ రోజు

1878: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత గవర్నర్ సి.రాజగోపాలచారి(ఫొటోలో) జననం
1896: డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం
1952: సినీ నటి సుజాత జననం
1955: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన రోజు
1985: సినీ నటి కామ్నా జఠ్మలానీ జననం
– అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
News December 10, 2025
3రోజుల పాటు AP ఛాంబర్స్ బిజినెస్ EXPO

యువత, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే లక్ష్యంతో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు AP ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. VJAలో ఈ నెల 12,13,14 తేదీల్లో జరిగే EXPOలో మంత్రులు పాల్గొంటారన్నారు. MSME, టూరిజం, టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మహిళ సాధికారతపై సెమినార్లు ఉంటాయని చెప్పారు. 160స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఎంట్రీ ఉచితమన్నారు.
News December 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


