News May 11, 2024
T20WC: 24న అమెరికాకు రోహిత్, హార్దిక్

పొట్టి ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా క్రికెటర్లు రెండు బ్యాచులుగా అమెరికా వెళ్లనున్నారు. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన టీమ్‌లలో ఉన్న క్రికెటర్లు తొలి విడతలో పయనం కానున్నారు. ఇప్పటికే ముంబై, పంజాబ్ జట్లు ఎలిమినేట్ కావడంతో రోహిత్, హార్దిక్, సూర్య, బుమ్రా, అర్షదీప్ ఈ నెల 24న అమెరికాకు పయనమవుతారని జైషా చెప్పారు. మిగిలిన ఆటగాళ్లు మే 27 లేదా 28న బయలుదేరే అవకాశముంది.
Similar News
News February 19, 2025
ఎవరీ రేఖా గుప్తా?

ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా బినోయ్ సామాజిక వర్గానికి చెందిన నేత. విద్యార్థి దశ నుంచే ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1996-97 మధ్య ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా పని చేశారు. సౌత్ ఢిల్లీ మేయర్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో షాలిమార్ బాగ్ (నార్త్ వెస్ట్) నుంచి 29595 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
News February 19, 2025
అదే మా పార్టీ ఆలోచన: KTR

తెలంగాణకు ఏనాటికైనా BRS పార్టీయే రక్షణ కవచం అని KTR అన్నారు. BRS విస్తృతస్థాయి సమావేశం అనంతరం మాట్లాడుతూ ‘KCR గారు ఒకటే మాట చెప్పారు. పార్టీలు ఓడిపోతుంటాయి. గెలుస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు, తెలంగాణ సమాజం గెలవాలి. అదే మా ఆలోచన’ అని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఫైరయ్యారు.
News February 19, 2025
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్

TG: 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు పోటీలు కొనసాగనున్నాయి. ఓపెనింగ్, క్లోజింగ్ సెర్మనీ, గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీల్లో 120 దేశాల యువతులు అలరించనున్నారు. ఇందులో పాల్గొనే వారి వయసు 17 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. ఏ దేశంలో పుడితే ఆ దేశం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. విజేతకు వజ్రాల కిరీటం అందిస్తారు.