News May 15, 2024
T20WC: హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరగనుండగా 28 వేల టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడయ్యాయి. రూ.500 నుంచి రూ.33 వేల వరకు ధర ఉన్న టికెట్లను క్రికెట్ అభిమానులు పోటీపడి కొనుగోలు చేశారు. ఈ మెగా టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుండగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 16, 2025
తెలంగాణ మొత్తం అప్పు ₹4,42,297 కోట్లు

TG: రాష్ట్రం అప్పు మొత్తం ₹4,42,297 కోట్లకు చేరినట్లు RBI తాజా రిపోర్ట్ ప్రకటించింది. ‘2024లో ₹3.93L కోట్లు కాగా 2025 మార్చినాటికి మరో ₹50వేల కోట్లు పెరిగింది. ఇందులో స్టేట్ డెవలప్‌మెంట్ లోన్‌గా ₹3.58L కోట్లు, పవర్ బాండ్లతో ₹7100 CR, NSSF నుంచి ₹3334 CR, నాబార్డు నుంచి ₹5390CR, బ్యాంకుల నుంచి ₹3వేల Cr, కేంద్రం నుంచి ₹14727 CR, PF నుంచి ₹16,700 CR రుణం తీసుకుంది’ అని పేర్కొంది.
News December 16, 2025
పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు

TG: కొమురం భీమ్(D) సిర్పూర్‌లో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో వారు తలదాచుకున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోయేందుకే వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పలువురు మావోయిస్టు నేతలు లొంగిపోయిన సంగతి తెలిసిందే.
News December 16, 2025
జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.


