News April 4, 2024
టెస్లాను హైదరాబాద్‌కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి: KTR

‘టెస్లా’ కార్ల కంపెనీ ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. ‘టెస్లా ప్లాంట్‌ను మన రాష్ట్రానికి తీసుకురావడానికి TS ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేయాలని మనవి చేస్తున్నా. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను వారికి వివరించి టెస్లా బృందం హైదరాబాద్‌ను సందర్శించేలా చర్యలు తీసుకోండి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 18, 2026
వెంటిలేటర్‌పై సల్మాన్ ఖాన్ తండ్రి?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత <<19165776>>సలీమ్ ఖాన్<<>> (90) వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం అస్వస్థతకు గురవడంతో ముంబైలోని లీలావతీ ఆస్పత్రికి తరలించారు. రేపు ఉదయం ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు.
News February 18, 2026
2050 నాటికి ఉద్యోగాలే ఉండవు: వినోద్ ఖోస్లా

AI ప్రభావంపై టెక్ బిలియనీర్ వినోద్ ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మనుషులకు ఉద్యోగాల అవసరమే ఉండదని ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో అన్నారు. IT సేవలు, BPO రంగాలు వచ్చే ఐదేళ్లలో పూర్తిగా కనుమరుగవుతాయని స్పష్టం చేశారు. మనిషి మేధస్సుతో చేసే పనులనే కాకుండా రోబోల సాయంతో శారీరక శ్రమను కూడా AI భర్తీ చేస్తుందన్నారు. ఫలితంగా విద్య, వైద్యం వంటి సేవలు ఉచితమవుతాయని పేర్కొన్నారు.