News March 26, 2024
దాని గురించి మాట్లాడటం నాన్‌సెన్స్: రాజన్

ఇండియా 2047లో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందా? అనే ప్రశ్నపై RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం ‘నాన్‌సెన్స్’ అన్నారు. దేశంలో ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉందని సూచించారు. కొందరు సృష్టిస్తున్న హైప్‌ను అందరూ నమ్మడమే దేశం చేస్తున్న పెద్ద తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో చాలామంది పిల్లలకు చదువు అందడం లేదని, డ్రాపౌట్స్ పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
Similar News
News February 10, 2026
స్పీకర్‌పై అవిశ్వాసం.. మద్దతుకు టీఎంసీ నిరాకరణ?

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటి వరకు 100 మందికి పైగా విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాసేపట్లో ఆ నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేయనున్నారు.
News February 10, 2026
‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్!

దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. సెన్సార్ వివాదంలో భాగంగా నిర్మాత వేసిన కేసు ఉపసంహరణకు మద్రాస్ హైకోర్టు అనుమతించింది. దీంతో సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ముందుకు చిత్రం వెళ్లనుంది. క్లియరెన్స్ లభిస్తే ఈ నెలలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. విజయ్ రాజకీయ ఎంట్రీకి ముందు వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
News February 10, 2026
డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం.. ఉద్రిక్తత

HYDలో డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మక్తల్‌లో ఆరో వార్డు అభ్యర్థి మహదేవప్ప <<19098651>>ఆత్మహత్య<<>> చేసుకోవడంపై కమలం నేతలు ఆందోళనకు దిగారు. అతడి మరణానికి కాంగ్రెస్ పార్టీ వేధింపులే కారణమని నిరసన చేపట్టారు. డీజీపీ ఆఫీసులోకి దూసుకెళ్లబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


