News January 29, 2025
ఉక్రెయిన్‌తో చర్చలు.. కానీ జెలన్‌స్కీతో కాదు: పుతిన్

ఉక్రెయిన్‌తో చర్చలకు తాము సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. కానీ ఆ దేశ అధ్యక్షుడు జెలన్‌స్కీతో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తాను చర్చలు జరపనని స్పష్టం చేశారు. ఒకవేళ జెలన్‌స్కీ చర్చలకు వస్తే నా తరఫున ఇతరులను పంపిస్తానని చెప్పారు. మార్షల్ లా సమయంలోనే ఆయన అధ్యక్ష పదవి ముగిసిందని పుతిన్ చెప్పారు. అందుకే అతడితో కలిసి చర్చల్లో కూర్చునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Similar News
News February 16, 2025
న్యాయమూర్తులను ఏరేస్తున్న ట్రంప్

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా 20మంది ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను తొలగించారు. దీంతో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పలువురు కోర్టులలో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘తన దేశాన్ని కాపాడుకొనే వ్యక్తి ఎన్నటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు’ అనే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
News February 16, 2025
రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబం: జగ్గారెడ్డి

TG: రాహుల్ గాంధీ కులంపై ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బదులిచ్చారు. రాహుల్‌ది బ్రాహ్మణ కుటుంబమని, వారు హిందువులని పేర్కొన్నారు. సోనియాను ఉద్దేశించి హిందూ ధర్మం ప్రకారం భర్త మతమే భార్యకు వస్తుందని చెప్పారు. బీజేపీ నేతలు చేసే విమర్శల్లో కొన్నయినా వాస్తవాలు ఉండాలని హితవు పలికారు. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పని చేసిందని తెలిపారు.
News February 16, 2025
ఆ లోపే బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక: కిషన్ రెడ్డి

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీకి బీఆర్ఎస్‌తో కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత సంబంధం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.