News December 1, 2025
TCILలో 150 పోస్టులు.. అప్లై చేశారా?

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL)లో 150 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్, డాక్యుమెంట్స్‌ను tcilksa@tcil.net.in, tcilksahr@gmail.comకు ఇ మెయిల్ ద్వారా పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tcil.net.in/
Similar News
News February 18, 2026
పార్టీ నేతలపై బొత్స పట్టు కోల్పోయారు: లోకేశ్

AP: మండలిలో YCP పక్షనేత బొత్స సత్యనారాయణ ఆ పార్టీ నేతలపై పట్టు కోల్పోయారని మంత్రి లోకేశ్ విమర్శించారు. ‘YCP నుంచి ఇద్దరు MLCలు వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఒకరు లడ్డూ కల్తీపై, మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చ అడిగారు. వారిలో ఎవరు పైచేయి సాధిస్తారనే ఆసక్తి మాలో ఉంది’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌తో సంబంధం ఉందని, అందుకే చర్చ పెట్టాలని అడుగుతున్నట్లు బొత్స తెలిపారు.
News February 18, 2026
OTD: టీమ్ఇండియా సంచలన విజయం

రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రాజ్‌కోట్‌లో టీమ్‌ఇండియా చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. ENGతో 3rd టెస్టులో 434 రన్స్ తేడాతో గెలిచింది. టెస్టుల్లో పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(131), జడేజా(112), రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (214), గిల్ (91) రాణించారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి జడేజా 7, సిరాజ్ 4, బుమ్రా 2, అశ్విన్ 2, కుల్దీప్ 4 వికెట్లు తీశారు.
News February 18, 2026
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వెలువడనుండగా మార్చి 16వ తేదీన పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి 37 మంది రాజ్యసభ సభ్యులను ఎన్నుకోనున్నారు. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న BRS MP సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ పదవీకాలం ముగియనుంది.


