News March 31, 2024
TDPపై అభిమానం.. పెళ్లి కార్డు ఫొటో VIRAL

అభిమానాన్ని పెళ్లి కార్డుల రూపంలో చూపుడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. ప.గో జిల్లా ఆచంటలో ఓ యువకుడు TDPపై అభిమానాన్ని చాటుకున్నాడు. పెళ్లి కార్డుపై ‘ఓట్ ఫర్ టీడీపీ’ అంటూ ఆచంట నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఫొటోలు ముద్రించుకున్నాడు. కార్డు వెనుక వైపు ‘మన ఆచంట- మన పితాని’ అని రాసి ఉన్న ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Similar News
News February 7, 2026
ఉండి: కాలువలో కుళ్లిన మృతదేహం

ఉండి మండలం చెరుకువాడ పంట కాలువలో శనివారం ఒక వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని, శరీరంపై కేవలం నీలిరంగు లుంగీ మాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉందని ఉండి SI నసీరుల్లా పేర్కొన్నారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 6, 2026
రేపు రైస్ మిల్లర్లకు ఎంఎస్‌ఎంఈపై అవగాహన: కలెక్టర్

పెదమిరంలోని నిర్మల ఫంక్షన్ హాల్‌లో శనివారం ఈనెల 7 ఎంఎస్‌ఎంఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రైస్ మిల్లుల యజమానులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, యువ నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
News February 6, 2026
ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియకు సహకరించాలని: జేసీ

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలంటే ప్రజల పూర్తిస్థాయిలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియకు సహకరించాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. శుక్రవారం భీమవరం 21వ వార్డు పెద్ద పేట కుసుమ ప్రియ అపార్ట్మెంట్ వద్ద నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియలో జేసీ స్వయంగా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడారు. సర్వేను త్వరితగతం పూర్తి చేయాలన్నారు.


