News April 30, 2024
TDP నుంచి జేడీ రాజశేఖర్ సస్పెండ్

తిరుపతి జిల్లా సత్యవేడుకు చెందిన JD రాజశేఖర్‌ను TDP సస్పెండ్ చేసింది. 2019 ఎన్నికల్లో ఆయన TDP అభ్యర్థిగా పోటీ చేసి YCP అభ్యర్థి ఆదిమూలం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మాజీ MLA హేమలతకు TDP ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆదిమూలానికి TDP టికెట్ దక్కడంతో రాజశేఖర్, హేమలత రెబల్‌గా నామినేషన్ వేశారు. హేమలత నామినేషన్ తిరస్కరణకు గురైంది. రాజశేఖర్ పోటీలో కొనసాగుతుండటంతో ఆయనపై TDP వేటు వేసింది.
Similar News
News December 12, 2025
చిత్తూరు: 2.22 లక్షల మందికి పోలియో చుక్కలు

ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేలా అధికారులు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరు డీఆర్వో మోహన్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో పల్స్ పోలియో సమావేశం శుక్రవారం నిర్వహించారు. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో 2.22 లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వీరికి 142 రూట్లలో 5,794 బూత్‌ల పరిధిలో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.
News December 12, 2025
ఫోన్ నంబర్ల బోర్డులు పెట్టండి: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ ప్రదేశాల్లో ఆసుపత్రులు, డాక్టర్ల ఫోను నెంబర్ల వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ హైవేల్లో చేపట్టాల్సిన చర్యలను వివరించారు.
News December 12, 2025
పుంగనూరు: జిల్లాలో నేటి టమాటా ధరలు

చిత్తూరు జిల్లాలో టమాట ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో నాణ్యత కలిగిన మొదటి రకం టమాటాలు గరిష్ఠంగా 10 కిలోలు రూ. 320, పలమనేరు మార్కెట్ లో రూ.310, వీకోట మార్కెట్ లో రూ. 300 వరకు పలికాయి. మూడు మార్కెట్లకు కలిపి 94 మెట్రిక్ టన్నుల కాయలు రైతులు తీసుకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.


