News May 2, 2024

ఈసీ నిర్ణయంపై హైకోర్టులో టీడీపీ పిటిషన్

image

AP: జనసేన గాజు గ్లాసు గుర్తుపై ఈసీ ఇచ్చిన <<13157827>>ఉత్తర్వులు <<>>గందరగోళంగా ఉన్నాయంటూ టీడీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఇతరులెవరికీ ఈ గుర్తు కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని టీడీపీ హైకోర్టును కోరింది. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది. అభ్యర్థుల పేర్లను చదవలేని నిరక్షరాస్యులైన ఓటర్లు పార్టీ గుర్తునుబట్టి ఓటేస్తారని.. వర్ల రామయ్య పిటిషన్‌లో పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

image

☛ ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి.
☛ బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.

News December 5, 2025

స్మృతి మంధాన ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎక్కడ?

image

తన వివాహం వాయిదా పడిన తర్వాత క్రికెటర్ స్మృతి మంధాన చేసిన తొలి ఇన్‌స్టా పోస్ట్ చర్చనీయాంశమైంది. ఓ యాడ్ షూట్‌ వీడియోను ఆమె షేర్ చేయగా.. అందులో స్మృతి చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపించకపోవడాన్ని ఫ్యాన్స్ గుర్తించారు. దీంతో ఉంగరం ఎక్కడుందని, పెళ్లి రద్దయిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ కొత్త వివాహ తేదీపై ప్రకటన చేయకపోవడం, రింగ్ తీసేయడం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు.

News December 5, 2025

IndiGo సంక్షోభం.. బాధ్యత ఎవరిది?

image

కొత్త FDTL (Flight Duty Time Limitations) నిబంధనల అమలుతో <<18479258>>IndiGo<<>> తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పైలట్లకు వారానికి 48 గంటల రెస్ట్‌తో పాటు ఇతర పరిమితులతో సిబ్బంది కొరత తలెత్తింది. DGCA 18 నెలల గడువు ఇచ్చినా సంస్థ సిబ్బందిని నియమించుకోలేదని పైలట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల భద్రత కోసమే ప్రభుత్వం నియమాలు తీసుకువచ్చిందని.. విమానాల రద్దు, ఆలస్యానికి ప్రణాళిక లోపమే కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.