News October 6, 2024
టీమ్ ఇండియా ఈరోజు ఓడితే ఇంటికే!
మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత అమ్మాయిలు నేడు పాక్‌తో తలపడుతున్నారు. టోర్నీలో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. భారత్ ఉన్న గ్రూప్‌లో 5 జట్లుండగా, ఇండియానే లాస్ట్ ప్లేస్‌లో ఉంది. తొలి 2 స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. పాక్‌పై ఘన విజయం దక్కితే 3వ ప్లేస్‌కు చేరుకోవచ్చు. మిగిలిన మ్యాచులు కూడా గెలిచి, రన్‌రేట్ బాగుంటేనే భారత్ సెమీస్‌కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
Similar News
News November 6, 2024
మేక్ అమెరికా గ్రేట్ అగైన్ vs మేకిన్ ఇండియా.. ఏం జరగబోతోంది!
డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అమెరికా, భారత్ సంబంధాలు మరింత బలపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మేకిన్ ఇండియాతో మోదీ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ తమ సొంత దేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెప్తున్నారు. వీరిద్దరూ మంచి మిత్రులు కావడంతో వాణిజ్య, రక్షణ, టారిఫ్ అంశాల్లో పంతానికి పోకుండా మధ్యేమార్గం వెతుకుతారని అంటున్నారు. లీగల్ ఇమ్మిగ్రేషన్ పరంగా భారతీయులకు ఇబ్బందులేమీ ఉండవని చెప్తున్నారు.
News November 6, 2024
సిబ్బందికి ప్రజలు అందుబాటులో ఉండాలి: భట్టి
TG: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఆధార్, ధరణి, రేషన్‌కార్డు వివరాల సేకరణకు సిబ్బంది వచ్చినప్పుడు ప్రజలు అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ప్రజల పరిస్థితిని అంచనా వేయడానికి రాజకీయ, ఆదాయ డేటాను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల వివరాలకు గోప్యత ఉంటుందని భట్టి చెప్పారు. ఇదొక విప్లవాత్మక కార్యక్రమమని అభివర్ణించారు.
News November 6, 2024
అయ్యర్ మరో సెంచరీ
భారత ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నారు. ఒడిశాతో జరుగుతున్న రంజీ మ్యాచులో ముంబై తరఫున 101 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఈ సీజన్‌లో 20 రోజుల వ్యవధిలోనే రెండో సెంచరీ చేయడం గమనార్హం. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడికి ఇది 15వ శతకం.