News November 16, 2025

TELANGANA NEWS

image

✦ టోక్యో డెఫ్లింపిక్స్-2025 షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు రూ.1.20కోటి నజరానా: మంత్రి శ్రీహరి
✦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో BJP MP ఈటల భేటీ.. కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని, బాలానగర్-నరసాపూర్ హైవేలో, నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ వైపు ఫ్లై ఓవర్లు నిర్మించాలని విజ్ఞప్తి
✦ తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. అర్హులందరికీ ఇస్తాం: మంత్రి పొంగులేటి

Similar News

News January 18, 2026

హీరో ధనుష్‌తో పెళ్లి.. మృణాల్ టీమ్ రియాక్షన్ ఇదే

image

వచ్చే నెల 14న తమిళ హీరో ధనుష్‌తో <<18863331>>పెళ్లి<<>> అంటూ జరుగుతున్న ప్రచారానికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ టీమ్ తెరదించింది. ‘మృణాల్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోవట్లేదు. ఎలాంటి కారణం లేకుండానే ఈ ప్రచారం జరుగుతోంది’ అని పేర్కొంది. అది పూర్తిగా తప్పుడు ప్రచారమని, ఎవరూ నమ్మొద్దని సూచించింది. కాగా ఇప్పటివరకు మృణాల్ గానీ ధనుష్ గానీ ఈ ప్రచారంపై స్పందించకపోవడం గమనార్హం.

News January 18, 2026

రాష్ట్ర పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి: బొత్స

image

AP: రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఏ వర్గానికీ సంక్రాంతి సంతోషం లేదన్నారు. పండగ ముందే మద్యం ధరలు, భూముల విలువలు పెరిగాయని విమర్శించారు. ‘పంటలకు గిట్టుబాటు ధర లేదు. యూరియా ఇప్పటికీ అధిక ధరకే అమ్ముతున్నారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా అటకెక్కింది. గ్రామ బహిష్కరణలు, శాంతిభద్రతల లోపాలపై ప్రధాని మోదీ స్పందించాలి’ అని కోరారు.

News January 18, 2026

నితీశ్ కుమార్ రెడ్డికి మంచి ఛాన్స్..

image

వరుస ఫెయిల్యూర్స్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న నితీశ్ రెడ్డికి మంచి ఛాన్స్ దొరికింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కీలక వికెట్లు కోల్పోగా.. విరాట్, నితీశ్ క్రీజులో ఉన్నారు. భారత్ మ్యాచ్ గెలవాలంటే వీరిద్దరి మధ్య కీలక భాగస్వామ్యం తప్పనిసరి. మరి నితీశ్ అనుభవజ్ఞుడైన కోహ్లీతో కలిసి రాణిస్తారా? కామెంట్ చేయండి.