News December 23, 2024
జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
వచ్చే నెల 20 నుంచి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సుకు భారత్ నుంచి ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఇందులో పాల్గొంటారు. వీరితో పాటు ఏపీ మంత్రి లోకేశ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, TN మంత్రి టీఆర్‌బీ రాజా, యూపీ మంత్రి సురేశ్ ఖన్నా తదితరులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.
Similar News
News January 19, 2025
షకీబ్‌పై అరెస్ట్ వారెంట్
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్, ఎంపీ షకీబ్ అల్ హసన్‌కు మరో షాక్ తగిలింది. IFIC బ్యాంకుకు సంబంధించి 3 లక్షల డాలర్ల చెక్ బౌన్స్ కేసులో ఢాకా కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తమ ముందు హాజరుకావాలని సమన్లు ఇచ్చినా షకీబ్ స్పందించకపోవడంతో న్యాయస్థానం చర్యలకు దిగింది. కాగా ఇటీవల అతని బౌలింగ్‌పై ఐసీసీ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాతి నుంచి అతను విదేశాల్లోనే ఉంటున్నారు.
News January 19, 2025
అది సైఫ్ నివాసమని దొంగకు తెలియదు: అజిత్
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి నేపథ్యంలో ముంబైలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. నిందితుడికి అది సెలబ్రిటీ నివాసమని తెలియదని, దొంగతనం కోసమే వెళ్లాడని తెలిపారు. అతడు బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చి తర్వాత ముంబైకి మకాం మార్చాడన్నారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News January 19, 2025
ఖోఖో.. మనోళ్లు కొట్టేశారంతే!!
ఖోఖో తొలి ప్రపంచకప్‌లోనే భారత్ తన సత్తా చాటింది. మన పురుషులు, మహిళల జట్లు విశ్వ విజేతలుగా నిలిచాయి. కాసేపటి క్రితం ముగిసిన మెన్స్ ఫైనల్స్‌లో నేపాల్‌పై 54-36 తేడాతో టీమిండియా గెలుపొంది తొలి కప్‌ను ముద్దాడింది. అంతకుముందు అమ్మాయిల జట్టు సైతం నేపాల్ ఉమెన్స్ టీమ్‌ను 78-40 తేడాతో చిత్తు చేసి తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. భారత్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 23 దేశాలు పాల్గొన్నాయి.