News November 21, 2024

టీమ్ ఇండియా తుది జట్టులోకి తెలుగు తేజం?

image

రేపటి నుంచి AUSతో జరిగే BGT తొలి టెస్టుతో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. AUSలో అతడు రాణించగలడని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తాజా ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ధాటిగా బ్యాటింగ్, వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయగల నితీశ్ లాంటి ఆల్‌రౌండర్ అవసరం ప్రతి జట్టుకు ఉంటుందన్నారు. దీంతో అతడికి తుది జట్టులో చోటు కన్ఫర్మ్ అని వార్తలొస్తున్నాయి. దీనిపై రేపు స్పష్టత రానుంది.

Similar News

News December 11, 2024

SHOCKING: ప్రపంచంపైకి మరో మహమ్మారి?

image

కరోనా మహమ్మారి ఎలాంటి విధ్వంసం సృష్టించిందో చూశాం. చైనాలోని ల్యాబ్ నుంచి ఆ వైరస్ లీకైందన్న ఆరోపణలున్నాయి. అదే తరహాలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబ్‌ నుంచి ప్రమాదకరమైన పలు వైరస్‌లు మిస్ కావడం కలకలం రేపుతోంది. హెండ్రా వైరస్, లిస్సా వైరస్, హంటా వైరస్ వంటివి వాటిలో ఉన్నాయని ఫాక్స్ న్యూస్ తెలిపింది. దీంతో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

News December 11, 2024

ఎంట్రీ ఇచ్చిన 26 నెలల్లోనే నం.1 ర్యాంకు

image

ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ టెస్టుల్లో నం.1 బ్యాటర్‌‌గా నిలిచారు. 2022 సెప్టెంబర్‌లో తొలి అంతర్జాతీయ టెస్టు ఆడిన ఈ ప్లేయర్ కేవలం 26 నెలల్లోనే తొలి స్థానానికి ఎదిగారు. ఇప్పటివరకు 23 టెస్టులు ఆడిన బ్రూక్ 2,280 పరుగులు చేశారు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 8 సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి.

News December 11, 2024

2034లో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఎక్కడంటే?

image

ప్రతిష్ఠాత్మక 2034 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఫిఫా ప్రకటించింది. మరోవైపు స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు సంయుక్తంగా 2030 వరల్డ్‌కప్ నిర్వహించనున్నాయని తెలిపింది. 2026 WCకు నార్త్ అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక 2022లో అర్జెంటీనా ప్రపంచకప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.