News March 31, 2024
ముగిసిన టెన్త్ పరీక్షలు.. రేపటి నుంచి మూల్యాంకనం

AP: నిన్నటితో రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 18న ప్రారంభమైన ఎగ్జామ్స్‌కు 6,18,822 మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. సుమారు 50 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి 25వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 8నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
Similar News
News February 17, 2026
కర్తరీ దోషం అంటే ఏమిటి?

సూర్యుడు కృత్తికా నక్షత్రంలో సంచరించే కాలాన్ని ‘కర్తరీ దోషం’ అంటారు. దీన్నే ‘అగ్ని నక్షత్రం’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది ప్రతి ఏటా మే నెలలో వస్తుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నేరుగా పడతాయి. దీనివల్ల ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ కాలాన్ని ప్రకృతి పరంగా కష్టకాలంగా భావిస్తారు. అందుకే ఈ 15-20 రోజుల పాటు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించరు.
News February 17, 2026
మామిడి పంట.. ఈ దశలో పోషకాలు అందించండి

మామిడి పిందెలు బఠాణీ లేదా గోళీకాయ సైజులో ఉన్నప్పుడు చెట్లకు మరోసారి పోషకాలను అందించాలంటున్నారు నిపుణులు. ఈ దశలో లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10-15 గ్రా., యూరియా లీటరు నీటికి 10 గ్రా. మరియు అర్కమ్యాంగో స్పెషల్ లీటరు నీటికి 5గ్రా. లేదా ఫార్ములా-4 లీటరు నీటికి 2.5గ్రా సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల పిందె రాలడం తగ్గి కాయలు మంచి సైజుకు వచ్చి అధిక బరువు పెరుగుతాయి.
News February 17, 2026
ఇవాళ్టి నుంచి CBSE బోర్డు పరీక్షలు!

CBSE 10, 12వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది టెన్త్, 18.5 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారు. రోజూ 10.30AM-1.30PM మధ్య ఎగ్జామ్స్ జరుగుతాయి. 10AM తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. రెగ్యులర్ విద్యార్థులు స్కూల్ డ్రెస్‌లో రావాలి. ప్రైవేటు స్టూడెంట్లు సాధారణ దుస్తుల్లో రావచ్చు. టెన్త్ విద్యార్థులకు మే నెలలో <<19159258>>రెండో విడత<<>> పరీక్షలు జరుగుతాయి.


