News March 7, 2025
టెన్త్ హాల్ టికెట్లు విడుదల

TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://bse.telangana.gov.inలోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం జిల్లా, స్కూల్, విద్యార్థి పేరుతో పాటు పుట్టినతేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇక్కడ <
*ALL THE BEST STUDENTS
Similar News
News December 13, 2025
కార్పొరేటర్‌గా గెలిచిన మాజీ DGP

కేరళ మాజీ DGP ఆర్.శ్రీలేఖ కార్పొరేటర్‌గా గెలిచారు. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, శాస్తమంగళం డివిజన్ నుంచి విజయం సాధించారు. కేరళ తొలి మహిళా ఐపీఎస్‌గా 1987లో శ్రీలేఖ ఎంపికయ్యారు. సీబీఐలో డిప్యూటేషన్‌పై పని చేసిన సమయంలో హైప్రొఫైల్ ఆపరేషన్లతో ‘రైడ్ శ్రీలేఖ’గా పేరు పొందారు. 33 ఏళ్ల సర్వీసు తర్వాత 2020లో డీజీపీ హోదాలో రిటైర్ అయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు.
News December 13, 2025
సమస్త సృష్టిని తనలో లయం చేసుకోగల సంగ్రహుడు

ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః|
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః||
ఇంద్రుని సోదరుడు ఉపేంద్రుడు, పొట్టి రూపుడైన వామనుడు, అతి పొడవైన ప్రాంశువు.. ఇవన్నీ విష్ణు నామాలే. ఆయన చేసే పనులు ఎన్నడూ వ్యర్థం కావు. పవిత్రమైన ఆయన బలమైనవాడు. అతీంద్రుడు. సమస్త సృష్టిని తనలో లయం చేసుకోగల సంగ్రహుడు. మన యోగ్యతను బట్టి పునర్జన్మలు ఇస్తాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 13, 2025
IIMC 51పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (<


