News February 15, 2025
టెన్త్ పాసైతే 32,438 ఉద్యోగాలు.. వారం రోజులే ఛాన్స్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు అర్హులు. వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ENGతో పాటు తెలుగులోనూ పరీక్ష రాయొచ్చు. <
Similar News
News March 28, 2025
కుప్పకూలిన భవనం.. మరో మృతదేహం లభ్యం

TG: భద్రాచలంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా మరో మృతదేహాన్ని సిబ్బంది వెలికితీశారు. అతడిని భద్రాచలానికి చెందిన ఉపేందర్(38)గా గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
News March 28, 2025
ప్రభుత్వం సంచలన నిర్ణయం

TG: పదవీ విరమణ చేసి కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో మెట్రోరైలు MD ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు లాంటి వారు కూడా ఉండటం గమనార్హం. ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల కొత్తగా 6వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది.
News March 28, 2025
ఆసుపత్రిలో చేరిన కింగ్ ఛార్లెస్-3

బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 ఆసుపత్రిలో చేరారు. 76ఏళ్ల ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అందుకు చికిత్స తీసుకుంటుండగా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్‌తో హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం కింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని లండన్‌లోని బకింగ్‌హమ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది. 2022లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత బ్రిటన్ కింగ్‌గా అవతరించిన ఛార్లెస్‌కు 2024 ఫిబ్రవరిలో క్యాన్సర్ నిర్ధారణ అయింది.