News October 5, 2024
TENTH: రెండు రోజులపాటు సైన్స్ ఎగ్జామ్

TG: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జనరల్ సైన్స్ పేపర్‌ను రెండు రోజులపాటు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను ఇప్పటివరకు ఒకే రోజు నిర్వహిస్తూ వచ్చారు. ఇక నుంచి వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పేపర్‌కు ఎప్పటిలాగే 1.30hrs సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత టెన్త్ పేపర్లను 11నుంచి 6కు కుదించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 9, 2025
ప.గో జిల్లా మొత్తం 8 పరీక్షా కేంద్రాలు

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం 5, నరసాపురం 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
రూ.40 వేల కోట్లు ఇచ్చాం: కేంద్రం

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 2వ తేదీ నాటికి ఏపీకి మొత్తం రూ.40,337 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్‌సభలో BJP MP దగ్గుబాటి పురందీశ్వరి ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కోసం ఇప్పటివరకు రూ.20,650 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏపీకి బకాయిలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు.
News December 9, 2025
సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

AP: ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న ఈ ఏడాదిలోనే అత్యల్పంగా అల్లూరి(D) దళపతిగూడలో 3.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 3-4డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగడం వల్ల గాలులు వీస్తున్నాయని, ఫలితంగా చలి పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకు చలి కొనసాగుతుందని పేర్కొంది.


