News March 27, 2024
టెట్ ఫలితాలు, DSC నిర్వహణపై కీలక అప్‌డేట్

AP: TET ఫలితాల ప్రకటన, DSC-2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని యోచిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. దీనిపై అనుమతి కోరుతూ ECకి లేఖ రాశామన్నారు. అనుమతిస్తే TET ఫలితాలను ప్రకటించి, DSC హాల్ టికెట్లు విడుదల చేస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలతో SGT పరీక్షలకు అనర్హులైన వారికి, ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి త్వరలోనే ఫీజులను తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.
Similar News
News February 11, 2026
చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

కేంద్రం ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026’ పేరుతో సరికొత్త చెత్త సేకరణ విధానాన్ని తెచ్చింది. ఇకపై ఇంటి వద్దే వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేయడం తప్పనిసరి. గతంలో మూడు ఉండగా ఇప్పుడు ఒక డబ్బా పెరిగింది. తడి వ్యర్థాలకు గ్రీన్, పొడి వ్యర్థాలకు బ్లూ, ప్యాడ్లు-డైపర్ల కోసం రెడ్, ఇంట్లోని మెడికల్ వ్యర్థాల కోసం నలుపు డబ్బాలను వాడాలి. పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ సులభతరం చేయడానికి ఈ మార్పు చేశారు.
News February 11, 2026
అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని: గవర్నర్

AP: అమరావతి రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా ఉంటుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ ద్వారా అమరావతిని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సంకల్పించాం. అమరావతి భవిష్యత్తును నాశనం చేసే ఉద్దేశంతో గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. శ్వేతపత్రాల ద్వారా మా ప్రభుత్వం వాటిని ఎండగట్టింది. రాష్ట్ర GSDP రూ.15.91లక్షల కోట్ల నుంచి రూ.17.60లక్షల కోట్లకు పెరిగింది’ అని పేర్కొన్నారు.
News February 11, 2026
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5 సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు మార్చి 12 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA, CMA, CS, ICSI మెంబర్ షిప్‌తో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.concorindia.co.in


