News December 1, 2025
TGకి ఐదేళ్లలో రూ.3.76Lకోట్ల నిధులిచ్చాం: కేంద్రం

తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.3,76,175 కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. BJP MP అరవింద్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వివిధ పద్ధతుల్లో నిధులు విడుదల చేశామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రాబడి కింద రూ.4,35,919Cr వచ్చాయని తెలిపారు.
Similar News
News February 13, 2026
కానిస్టేబుల్ సస్పెండ్.. గెలిచిన భార్య!

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో సస్పెండైన కానిస్టేబుల్ భార్య గెలిచారు. సిద్దిపేట(D) చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో BRS తరఫున గీతాంజలి పోటీ చేశారు. ఆమె భర్త రమేశ్ కొమురవెళ్లి PSలో కానిస్టేబుల్. ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు వెళ్లడంతో విధుల నుంచి రమేశ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో గీతాంజలి కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజపై 223 ఓట్ల తేడాతో గెలిచారు.
News February 13, 2026
T20WC: USA భారీ స్కోర్

చెన్నై వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో USA చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. ముక్కమల్ల సాయితేజ 79 పరుగులతో సత్తా చాటారు. మరోవైపు శుభమ్ 24 బంతుల్లోనే 48 రన్స్ చేశారు. 3 ఫోర్లు, 2 సిక్సులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 3 వికెట్లు తీశారు.
News February 13, 2026
ఒక్క చోటా గెలవని తీన్మార్ మల్లన్న పార్టీ

TG: మున్సిపల్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పార్టీ ఒక్కచోటా గెలవలేకపోయింది. కత్తెర గుర్తుపై TRP అభ్యర్థులు పోటీ చేశారు. తమకు BC వర్గాల మద్దతు ఉంటుందని, కనీసం 40 స్థానాలు గెలుస్తామని మల్లన్న సహా నేతలు ప్రకటించారు. కానీ ఎక్కడా ఆ పార్టీ ప్రభావం కనిపించలేదు. సూర్యాపేటలోని 2 వార్డుల్లో మాత్రమే కొంతమేర ఓట్లు వచ్చాయి. ఇవి మినహా ఇంకెక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు.


