News February 10, 2025

TG ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: ఏపీ అర్చక సమాఖ్య

image

మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఖండించింది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ స్వామి కోరారు.

Similar News

News February 16, 2026

హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత క్షమాపణలు

image

హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన BJP నేత నాగేంద్రన్ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె గురించి అలా మాట్లాడి ఉండకూడదని విచారం వ్యక్తం చేశారు. త్రిషతో ఉన్న అనుబంధం నుంచి బయటపడితేనే టీవీకే చీఫ్ విజయ్‌కు వాస్తవాలు తెలుస్తాయంటూ ఆయన ఇటీవల <<19157644>>వ్యాఖ్యానించిన<<>> విషయం తెలిసిందే. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని త్రిష హెచ్చరించడంతో నాగేంద్రన్ దిగివచ్చారు.

News February 16, 2026

చిత్తూరు: కళ్లు లేవు సార్.. పెన్షన్ ఇప్పించండి!

image

జీడీనెల్లూరు గ్రామానికి చెందిన మాళవిక తన తండ్రితో కలిసి చిత్తూరులో జరిగిన గ్రీవెన్స్ డేకు హాజరైంది. తనకు రెండు కళ్లు లేవని.. పెన్షన్ ఇప్పించాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. గ్రామ సచివాలయ అధికారులను ఆశ్రయిస్తే.. రాదన్నారని చెప్పింది. అర్హతను పరిశీలించి పెన్షన్ మంజూరు చేయడానికి నివేదిక ఇవ్వాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

News February 16, 2026

INDvsPAK.. రికార్డు బ్రేకింగ్ వ్యూస్!

image

కొలంబో వేదికగా IND-PAK మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులు బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ను అభిమానులు మొబైల్ ఫోన్స్, టీవీల్లో లైవ్ వీక్షించి ఆనందించారు. అలాగే INDvsUSA మ్యాచ్‌కు 26 కోట్లు, INDvsNAM మ్యాచ్‌కు 24 కోట్ల వ్యూస్ వచ్చాయి.