News May 14, 2024

కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్

image

AP: వైసీపీ గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలను లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నా’ అంటూ సీఎం జగన్ పోస్ట్ పెట్టారు.

Similar News

News December 11, 2025

US దారిలో మెక్సికో.. భారత్‌పై 50% టారిఫ్స్

image

ఏషియన్ కంట్రీస్ దిగుమతులపై గరిష్ఠంగా 50% టారిఫ్స్ విధించేందుకు మెక్సికో సెనేట్ అంగీకరించింది. ఈ నిర్ణయంతో ఇండియా, చైనా, సౌత్ కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల 1400+ ఉత్పత్తులపై సుంకాలు 50% వరకు ఉండనున్నాయి. టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్స్ పార్ట్స్, ప్లాస్టిక్స్, మెటల్స్, ఫుట్‌వేర్‌ ఇండస్ట్రీస్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది. సెలక్టివ్ ఐటమ్స్‌పై 50%, అత్యధిక ఉత్పత్తులపై 35% వరకు టారిఫ్స్ ఉండనున్నాయి.

News December 11, 2025

పవన్ హాన్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>పవన్<<>> హాన్స్ లిమిటెడ్‌ 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ ఉత్తీర్ణులు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.2,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.pawanhans.co.in/

News December 11, 2025

సూపర్ నేపియర్ గడ్డి పెంపకానికి సూచనలు

image

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.