News June 4, 2024
ఆ రోజు రానే వచ్చింది.. దేశమంతా ఉత్కంఠ!
యావత్తు దేశంతో పాటు పలు ప్రపంచ దేశాలూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వచ్చే 5ఏళ్ల పాటు మన దేశ పాలనను ప్రజలు ఎవరి చేతుల్లో పెట్టారో నేటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల రూపంలో తేలనుంది. 8amకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 543 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. 272MP సీట్లు గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది. అటు హ్యాట్రిక్ కొడతామని BJP, ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉన్నాయి.
Similar News
News September 10, 2024
హైడ్రాకు ప్రత్యేక సిబ్బంది కేటాయింపు
TG: చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సిబ్బందిని కేటాయించింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్సై స్థాయి అధికారులను కేటాయిస్తూ డీజీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రాకు కమిషనర్‌గా రంగనాథ్ ఉన్న సంగతి తెలిసిందే.
News September 10, 2024
ఉచిత బస్సుతో అద్భుత ఫలితాలు.. సీఎంతో అధికారులు
TG: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉచిత బస్సు స్కీం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని అధికారులు సమీక్షలో సీఎంకు చెప్పారు. ఇప్పటివరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా ప్రయాణికులకు రూ.2,840 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి HYDలోని ఆస్పత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరిగిందని వివరించారు.
News September 10, 2024
త్వరలోనే ఆపరేషన్ బుడమేరు.. కబ్జా చేస్తే శిక్ష: CM
గత ఐదేళ్లలో బుడమేరు వాగుపై అక్రమ కట్టడాలు కట్టారని, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని.. ఒకానొక దశలో అది పూడుకుపోయే దశకు చేరిందని CM చంద్రబాబు తెలిపారు. చెత్తాచెదారం తీయకపోవడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంగా మారాయని, గట్లను పట్టించుకోకపోవడం వల్ల 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయని విమర్శించారు. త్వరలోనే ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేసి, కబ్జా చేసినట్లు తేలితే శిక్షిస్తామని సీఎం హెచ్చరించారు.