News August 4, 2024
అది తప్పుడు ప్రచారం.. నమ్మొద్దు: TTD

AP: తిరుమలకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు నేరుగా ప్రత్యేక దర్శనం కల్పిస్తారని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని TTD కోరింది. 3 నెలల ముందే ప్రతి నెలా 23న ఆన్‌లైన్ కోటా(రోజుకి 1000 మంది) విడుదల చేస్తామంది. అలా బుక్ చేసుకుని టికెట్లతో వచ్చిన వారినే అనుమతిస్తామని తెలిపింది. తిరుమలలోని నంబి ఆలయం వద్ద ఉన్న సీనియర్ సిటిజన్/PHC లైన్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతిస్తారని చెప్పింది.
Similar News
News December 17, 2025
ఆయిల్ పామ్ తోటల్లో నత్రజని లోపాన్ని ఎలా గుర్తించాలి?

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.
News December 17, 2025
CBFC ‘NO’.. IFFKలో రిలీజ్: CM విజయన్

సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వని సినిమాలను ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్- కేరళ’ (DEC12-19)లో రిలీజ్ చేస్తామని CM పినరయి విజయన్ ప్రకటించారు. ప్రశ్నించే గొంతులను అణచివేసే కేంద్ర నియంతృత్వ ప్రయత్నాలను కేరళ అంగీకరించదని Fbలో స్పష్టం చేశారు. అయితే CBFC నో చెప్పిన 19 మూవీల్లో 4 స్క్రీనింగ్‌కు I&B మినిస్ట్రీ అనుమతిచ్చింది. ప్రదర్శనకు 2 వారాల ముందు లిస్ట్ ఇవ్వనందుకే మిగతా వాటికి పర్మిషన్ లేదని పేర్కొంది.
News December 17, 2025
APPLY NOW: ICMRలో 28 పోస్టులు

<


