News December 15, 2024
పింక్ టెస్టులో లైట్స్ ఆగిపోవడానికి కారణం ఆ ఆటగాడే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734246721452_1045-normal-WIFI.webp)
రెండో టెస్టులో తొలి రోజు ఆటలో ఫ్లడ్ లైట్లు కాసేపు ఆగిన సంగతి తెలిసిందే. అందుకు గల కారణాన్ని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘నేను, మా అసిస్టెంట్ కోచ్ నెట్స్ వద్ద చీకట్లో కూర్చున్నాం. నెట్స్‌లో ప్రాక్టీస్ కోసం లైట్స్ వేయగలవా అని అక్కడికొచ్చిన గార్డును అడిగాం. అతడు లోపలికి వెళ్లగానే స్టేడియంలో లైట్స్ ఆగిపోయాయి. స్విచ్ తప్పుగా వేశాడని నేను, కోచ్ అనుకున్నాం’ అని తెలిపారు.
Similar News
News January 22, 2025
తిలక్ వర్మ చరిత్ర సృష్టిస్తాడా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737477813366_1032-normal-WIFI.webp)
టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. రేపు ఇంగ్లండ్‌తో జరిగే తొలి టీ20లో సెంచరీ సాధిస్తే హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తారు. ఇప్పటికే సౌతాఫ్రికాపై వరుసగా రెండు టీ20ల్లో శతకాలు బాదారు. సూపర్ ఫామ్, మూడో స్థానంలో బరిలోకి దిగడం, మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో ఆయన ఈ రికార్డును చేరే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
News January 22, 2025
జనవరి 22: చరిత్రలో ఈ రోజు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737479347819_782-normal-WIFI.webp)
1882: స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం
1918: కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటు
1940: తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి మరణం
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
1972: సినీ నటి నమ్రత జననం
1989: సినీ నటుడు నాగశౌర్య జననం
2014: తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు(ఫొటోలో) మరణం
News January 22, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737480141081_782-normal-WIFI.webp)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.