News May 1, 2024
మా ఓటమికి అదే కారణం: హార్దిక్

తమ ఓటమికి త్వరగా వికెట్లు కోల్పోవడమే ప్రధాన కారణమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నారు. ‘బంతిని సరిగ్గా అంచనా వేయలేక వికెట్లు చేజార్చుకున్నాం. ఈ సీజన్‌లో ఇలానే చాలాసార్లు ఓడిపోయాం. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. నేహాల్ వధేరా అద్భుత ఆటగాడు. కానీ అతడికి మరిన్ని ఛాన్స్‌లు ఇవ్వలేకపోయాం. భవిష్యత్‌లో వధేరా కచ్చితంగా టీమ్ ఇండియాకు ఆడతారు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
DOB సర్టిఫికెట్లపై ఆ ప్రచారం ఫేక్: PIB

డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2026 ఏప్రిల్ 27 తుది గడువుగా నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను PIB Fact Check ఖండించింది. వాట్సాప్‌లో వైరలవుతోన్న ఈ సమాచారం అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రభుత్వం అలాంటి నోటిఫికేషన్ లేదా గడువును జారీ చేయలేదని పేర్కొంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను షేర్ చేయొద్దని పౌరులకు సూచించింది.
News December 5, 2025
ఈ కంటెంట్ ఇక నెట్‌ఫ్లిక్స్‌లో..

Warner Bros(WB)ను నెట్‌ఫ్లిక్స్ <<18481221>>సొంతం<<>> చేసుకోవడంతో విస్తృతమైన కంటెంట్ అందుబాటులోకి రానుంది. 2022 లెక్కల ప్రకారం WBలో 12,500 సినిమాలు, 2,400 టెలివిజన్ సిరీస్‌లు(1,50,000 ఎపిసోడ్లు) ఉన్నాయి. దాదాపు 1,45,000 గంటల కంటెంట్ ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది బిగ్ బ్యాంగ్ థియరీ, హ్యారీపొటర్, ది సోప్రానోస్, ఫ్రెండ్స్, ది మెంటలిస్ట్, సూపర్ న్యాచురల్, ది వైర్ లాంటి సూపర్ హిట్ సిరీస్‌లను WBనే నిర్మించింది.
News December 5, 2025
మోతాదు మించితే పారాసిటమాల్ ప్రమాదమే: వైద్యులు

సరైన మోతాదులో తీసుకుంటే పారాసిటమాల్ సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే అధిక మోతాదులో వాడటం వల్ల లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. ‘రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఆల్కహాల్ సేవించినప్పుడు & ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ మాత్రలు వేసుకోవద్దు. జలుబు/ఫ్లూ ట్యాబ్లెట్లలో కూడా పారాసిటమాల్ ఉంటుంది కాబట్టి రోజువారీ మోతాదును సరిచూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.


