News May 7, 2025

అందుకే వెంకటేశ్ అయ్యర్ సరిగ్గా ఆడట్లేదేమో: ఆర్పీ సింగ్

image

KKR రూ.23.75 కోట్లు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ ఈ ఏడాది IPLలో 8 మ్యాచులాడి 135 పరుగులు చేశారు. ఆ వేలం ధరే అతడిపై ఒత్తిడిని పెంచుతుండొచ్చని మాజీ క్రికెటర్ RP సింగ్ అభిప్రాయపడ్డారు. ‘అంత ధర పెట్టి ఆటగాడిని కొన్నారంటే అతడే మెయిన్ ప్లేయర్ అనో లేక కాబోయే కెప్టెన్ అనో జట్టు నమ్ముతున్నట్లే. కానీ వెంకీ ఆ రెండూ కాలేకపోయారు. వేలంలో కేకేఆర్ ఘోరంగా విఫలమైందనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News February 18, 2026

‘అన్నా.. ప్లీజ్ వదిలేయ్ అన్నా’

image

అంటూ ఆ చిట్టితల్లి ఎంత ప్రాధేయపడి ఉంటుంది! ఆ మానవమృగ వికృతక్రీడలో ఎంత నరకం అనుభవించి ఉంటుంది? ఏపీలోని మదనపల్లెలో కులవర్ధన్ ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన <<19172410>>ఘటన<<>> తీవ్రంగా కలచివేస్తోంది. ఇంటి ముందే ఉండే అతడిని నిత్యం ఆప్యాయంగా ‘అన్నా.. అన్నా’ అని పిలిచినా ఆ దుర్మార్గుడు కనికరించలేదు. అత్యంత క్రూరంగా బాలికను నీటి డ్రమ్ములో కుక్కేశాడు. విధి ఆడిన వింత నాటకంలో అతడు కూడా నీటిలోనే శవమై తేలాడు.

News February 18, 2026

ఈ అలవాట్లతో బరువు తగ్గొచ్చు

image

కండరాల నిర్మాణం, బలం కోసం ప్రోటీన్ ఉన్న ఆహారం తినాలి. ముఖ్యంగా చికెన్, సీ ఫుడ్, ఎగ్స్, సోయా, నట్స్, సీడ్స్ వంటి లీన్ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. మటన్ వంటి మాంసాహారం తగ్గించాలి. దీంతో బరువు అదుపులో ఉంటుంది. క్యారెట్లు, ముల్లంగి, బీట్రూట్, మెంతికూర, పాలకూర ఎక్కువగా తింటే పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు కరుగుతుంది. సీజనల్ ఫ్రూట్స్, తగినంత నీరు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News February 18, 2026

ఎLAW: చిల్లుపై బిల్లుతో పోరాడవచ్చు

image

హోటళ్లలో ఫుడ్ తిన్నాక అస్వస్థతకు గురైతే ఆ మేనేజ్మెంట్‌ను తిట్టుకుని, డాక్టర్‌ను కలిసి మెడిసిన్ వేసుకుని సరిపెట్టుకుంటాం. కానీ మనకు జరిగిన శారీరక, ఆర్థిక, మానసిక నష్టానికి పరిహారం పొంది చట్టపర చర్యలతో మరోసారి, మరొకరికి ఇలా జరగకుండా చూడొచ్చు. దీనికి కావాల్సింది మీ ఫుడ్ బిల్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్. వీటితో ఫుడ్ సేఫ్టీ అథారిటీలో లేదా కోర్టులో కేసు వేయొచ్చు. కాబట్టి డబ్బు చెల్లించగానే బిల్ పడేయకండి.