News April 22, 2024

యుద్ధం ‘గర్భిణి’ని బలిగొంది.. వైద్యులు బిడ్డకు ఊపిరిచ్చారు

image

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికి వేదికగా నిలిచిన గాజాలో మరణమృదంగం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన వైమానిక దాడిలో 30 వారాల గర్భిణి, ఆమె భర్త, కూతురు ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు ఆ మహిళకు వేగంగా ఆపరేషన్ చేసి బిడ్డను కాపాడారు. 1.4 కిలోల బరువుతో పుట్టిన ఆ ఆడశిశువును ప్రస్తుతం ఇంక్యుబేటర్‌లో ఉంచారు. కాగా ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 34 వేలకు మందికి పైగా మృతి చెందినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.

Similar News

News December 8, 2025

రాయికల్: ‘ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి’

image

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి అన్నారు. రాయికల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు అవసరమైన సామగ్రిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి తిరిగి వాటిని స్ట్రాంగ్ రూములకు చేర్చడం వరకు ప్రిసైడింగ్ అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.

News December 8, 2025

10ఏళ్లలో రూ.కోటి విలువ రూ.55లక్షలే!

image

మీరు దాచుకున్న డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుందనే విషయం మీకు తెలుసా? మీ దగ్గర రూ.కోటి ఉంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం(6%) కొనసాగితే మరో పదేళ్లలో అది ₹55.8 లక్షలకు చేరనుంది. 2045లో రూ.31.18లక్షలు, 2075నాటికి ₹కోటి విలువ రూ.5.4లక్షలకు పడిపోనుంది. అందుకే డబ్బును పొదుపు చేయడంతో పాటు సంపద విలువను కాపాడుకోవడానికి పెట్టుబడి పెట్టడం అలవర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

News December 8, 2025

కేంద్ర ఉద్యోగులకు వేతన సవరణ ఆలస్యమేనా!

image

7వ PRC గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. 2026 JAN నుంచి 8వ PRC అమలు కావాలి. ఈ కమిషన్‌ను కేంద్రం ఈ ఏడాది JANలో వేసినా టర్మ్స్‌ను NOVలో కానీ ప్రకటించలేదు. కాగా PRCపై LSలో MPలు ప్రశ్నించగా ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటినుంచి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కమిషన్ నివేదికకు 18 నెలల సమయం పడుతుంది’ అని మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దీంతో కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్న PRC అమలు ఆలస్యం కావొచ్చంటున్నారు.