News August 9, 2024

ఫొగట్ అభ్యర్థనపై స్పందించిన కోర్టు

image

పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో ఫైనల్ చేరిన తనకు సిల్వర్ మెడల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ చేసిన అభ్యర్థనపై CAS(కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్) స్పందించింది. ఈ ఒలింపిక్ క్రీడలు ముగిసేలోపు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కాగా 100గ్రాముల అధిక బరువు వల్ల ఫైనల్స్‌లో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. <<-se>>#Olympics2024<<>>

Similar News

News December 7, 2025

వర్చువల్ బ్రెయిన్‌ను తయారు చేసిన సూపర్‌కంప్యూటర్

image

బ్రెయిన్ పనితీరు, అల్జీమర్స్‌పై స్టడీకి సూపర్‌కంప్యూటర్ సహాయంతో సైంటిస్ట్స్ వర్చువల్ మౌస్ బ్రెయిన్‌ తయారు చేశారు. USలోని అలెన్ ఇనిస్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో-కమ్యూనికేషన్స్ జపాన్ ఎక్స్‌పర్ట్‌లు 9మిలియన్ న్యూరాన్లు, 26బిలియన్ల సినాప్సెస్‌తో చేసిన కార్టెక్స్‌ సెకనుకు క్వాడ్రిలియన్ లెక్కలు చేయగలదు. హ్యూమన్ బ్రెయిన్‌ కంటే ఎలుక మెదడు చిన్నది, తక్కువ సంక్లిష్టమైనదైనా చాలా పోలికలుంటాయి.

News December 7, 2025

పవన్‌కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉడుపి(KN)లోని పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదును ప్రదానం చేశారు. ‘బృహత్ గీతోత్సవ’లో పవన్ మాట్లాడుతూ భగవద్గీత ఓ సారి చదివి ఎర్ర వస్త్రంతో కప్పి పూజా గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మన జీవితంలో ప్రతి నిర్ణయం, సమస్యలకు పరిష్కారంగా మనల్ని నడిపించే జ్ఞానం భగవద్గీత అని పేర్కొన్నారు.

News December 7, 2025

ఇంగ్లండ్ చెత్త రికార్డు

image

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగిస్తోంది. రెండో టెస్టులోనూ <<18496629>>పరాజయంపాలైన<<>> ఆ టీమ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. D/N టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 300+ స్కోర్ చేసి ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది. అలాగే ఒకే విదేశీ గడ్డపై విజయం లేకుండా అత్యధిక మ్యాచులు(16) ఆడిన క్రికెటర్‌గా జో రూట్ ఖాతాలో అన్‌వాంటెడ్ రికార్డు చేరింది. అతను ఆడిన మ్యాచుల్లో 14 ఓడిపోగా, 2 డ్రా అయ్యాయి.