News June 19, 2024

అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

image

తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సమాచారశాఖ కమిషనర్ జీవో జారీ చేశారు. స్టేట్, డిస్ట్రిక్ట్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రభుత్వం ప్రతి రెండేళ్లకోసారి అక్రిడిటేషన్ కార్డుల సదుపాయాన్ని కల్పిస్తుంది. ఆ గడువు జూన్ 30తో ముగియనుంది. దీంతో జర్నలిస్టుల సౌకర్యార్థం కార్డుల వాలిడిటీ పీరియడ్‌ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.

Similar News

News January 15, 2026

ఇవి తీసుకుంటే PCODకి చెక్

image

ఈ మధ్య కాలంలో మహిళలను PCOD ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య వల్ల అవాంఛిత రోమాలు రావడం, పీరియడ్స్ అస్తవ్యస్తంగా మారతాయని నిపుణులు. అయితే ఇది తగ్గాలంటే ఆహారంలో దాల్చిన చెక్క పొడి, పుదీనా టీ, ఫ్లాక్స్ సీడ్స్ చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, వ్యాయామం చేయడం, మంచి డైట్ తీసుకోవడం కూడా ముఖ్యమని చెబుతున్నారు.

News January 15, 2026

ఎన్టీఆర్ అదిరిపోయే లుక్

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదిరిపోయే లుక్‌లో దర్శనమిచ్చారు. బియర్డ్ లుక్‌లో సూపర్బ్ స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఆయన భారీగా గడ్డం పెంచారు. తాజాగా కారులో నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను పలువురు SMలో షేర్ చేశారు. తారక్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

News January 15, 2026

ఫోన్ ఎత్తుకెళ్లిన బెంగాల్ సీఎం.. సుప్రీంకోర్టులో ఈడీ

image

వెస్ట్ బెంగాల్ ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా విచారణ జరిగింది. సోదాల సమయంలో WB సీఎం మమతా తమ ఫోన్‌ను ఎత్తుకెళ్లినట్లు ఈడీ అధికారులు SCకి తెలియజేశారు. మనీలాండరింగ్ విషయమై సోదాల గురించి ముందే స్థానిక PSకు సమాచారమిచ్చినా పోలీసులతో మమతా తమ సోదాలకు అంతరాయం కలిగించారన్నారు. అటు పోలీసులను మమత నియంత్రించడం తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు పరిగణించింది.