News April 14, 2024
ఈ అభ్యర్థి అప్పులు రూ.649.50 కోట్లు

తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో ఓ ఎంపీ అభ్యర్థి అప్పులు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అరక్కోణం పార్లమెంట్ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్.జగద్రక్షకన్ తనకు రూ.649.50 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో తర్వాతి స్థానాల్లో శివగంగై బీజేపీ అభ్యర్థి దేవనాథన్ యాదవ్ రూ.98.30కోట్లు, వేలూరు డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్ రూ.51.61కోట్ల అప్పులున్నట్లు వెల్లడించారు.
Similar News
News December 17, 2025
స్మిత్‌కు ‘వర్టిగో’.. మూడో టెస్టుకు దూరం

యాషెస్ మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ అనారోగ్యానికి గురయ్యారు. వర్టిగో(తల తిరగడం లాంటి పరిస్థితి)కు గురవడంతో అతడికి రెస్ట్ ఇచ్చి ఉస్మాన్ ఖవాజాను జట్టులోకి తీసుకున్నారు. తల తిరుగుడు, వికారంతో స్మిత్ బాధపడుతున్నట్లు CA తెలిపింది. మరోవైపు ఫస్ట్ సెషన్‌లో AUS 94-2 రన్స్ చేసింది. రెండో సెషన్ ప్రారంభంలో ఒకే ఓవర్లో ఆర్చర్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో కమిన్స్ రీఎంట్రీ ఇచ్చారు.
News December 17, 2025
30కి పైగా దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇటీవల 12 దేశాలపై విధించగా, ఇప్పుడు ఆ సంఖ్య 30కి పైనే ఉంది. పాలస్తీనా, సిరియా, జింబాబ్వే సహా అనేక దేశాలు ఈ లిస్ట్‌లోకి వచ్చాయి. ఇమ్మిగ్రేషన్‌పై కఠిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ దేశ పౌరుల రికార్డుల విషయంలో నమ్మకం లేకపోవడంతో పాటు అవినీతి, క్రిమినల్ కేసులు వంటివి కారణాలుగా పేర్కొన్నారు.
News December 17, 2025
పండ్ల ఉత్పత్తిలో ఏపీకి ఫస్ట్ ప్లేస్

పండ్ల తోటల సాగులో 2024-25లో 1.93 కోట్ల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే AP తొలిస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 71.70లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా.. రాష్ట్రంలో 8.07లక్షల హెక్టార్లలో పండ్లు పండిస్తున్నారు. ఈ లిస్టులో 1.81లక్షల హెక్టార్ల సాగుతో TG 15వ స్థానంలో ఉంది. 1.68కోట్ల టన్నుల పండ్లను పండిస్తూ MH 2వ ప్లేస్ దక్కించుకుంది. ఏపీలో ఎక్కువగా 1.11లక్షల హెక్టార్లలో అరటి సాగైంది.


