News August 2, 2024

‘బ్రాంజ్’ పోరులో ఓడిన ధీరజ్-అంకిత జోడీ

image

పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత జోడీ ధీరజ్ బొమ్మదేవర-అంకితా భకత్ ఓడిపోయింది. బ్రాంజ్ మెడల్ మ్యాచులో అమెరికా చేతిలో 2-6 తేడాతో ఓటమి చవి చూసింది. తద్వారా త్రుటిలో పతకం గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. <<-se>>#Olympics2024<<>>

Similar News

News December 8, 2025

బాపట్ల: 108లో డ్రైవర్ల పోస్టుకు ఇంటర్వ్యూ

image

ప్రభుత్వ 108 వాహనంలో డ్రైవర్ల పోస్ట్‌కు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్ బాలకృష్ణ సోమవారం తెలిపారు. ఈనెల 10, 11న గొల్లపూడిలోని విజయవాడ భవ్య హెల్త్ సర్వీసెస్ ఆఫీస్ వద్ద ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు 10th పాసై, హెవీ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారు పై తేదీలలో ఇంటర్వూకి హాజరుకావాలని సూచించారు.

News December 8, 2025

సకల సంపద ‘విష్ణుమూర్తే’

image

వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః|
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః||
ఈ సృష్టిలోని సమస్త సంపద ఆ విష్ణుమూర్తే. ఆయన మన మంచి కోరుతాడు. ఎప్పుడూ సత్యంగా, అందరిపట్ల సమానంగా ఉంటాడు. ఆ అమోఘుడు పద్మం వంటి కళ్లతో వర్షాన్ని కురిపిస్తాడు. కురిసే వర్షం కూడా ఆయనే. ఈ ప్రపంచంలో ఉన్న సంపద, సత్యం, సమానత్వం.. అన్నీ భగవంతుడి స్వరూపాలే. అందుకే, మనమంతా ఆయనను ప్రేమతో, భక్తితో ధ్యానించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 8, 2025

‘స్మృతి ఈజ్ బ్యాక్’.. ప్రాక్టీస్ షురూ

image

పలాశ్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు తర్వాత భారత క్రికెటర్ స్మృతి తొలిసారి మీడియాకు కనిపించారు. ఈ నెల 21 నుంచి శ్రీలంకతో జరిగే T20 సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఫొటో బయటకు వచ్చింది. కాగా పెళ్లి రద్దుపై తమ ప్రైవసీని గౌరవించాలని ఆమె విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రాక్టీస్‌ను ఉద్దేశించి ‘స్మృతి ఈజ్ బ్యాక్’ అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.