News March 23, 2024
ఎక్సర్‌సైజ్ పిల్ వచ్చేస్తోంది!

ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నా కొందరు బద్ధకిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఎక్సర్‌సైజ్ పిల్ వచ్చేస్తోంది. వ్యాయామం చేస్తే కలిగే లాభాలు ఈ ఒక్క మాత్రలో ఉంటాయట. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. ఎలుకలపై వీటిని పరీక్షించినప్పుడు వ్యాయమం చేశాక ఉండే జీవక్రియనే వాటిలో గుర్తించారట. ఇది సక్సెస్ అయితే గుండె, నరాల సంబంధింత వ్యాధుల చికిత్సలో ముందడుగు పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు రాలేను: ఖర్గే లేఖ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు హాజరు కాలేకపోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాలు, ముందస్తుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల నేపథ్యంలో రాలేకపోతున్నట్లు వివరించారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రేవంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఇవాళ, రేపు సమ్మిట్ జరగనున్న విషయం తెలిసిందే.
News December 8, 2025
డిసెంబర్ 8: చరిత్రలో ఈ రోజు

1935: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర జననం
1939: గాయని ఎల్.ఆర్.ఈశ్వరి జననం(ఫొటోలో)
1953: హాస్యనటుడు మనోబాల జననం
1984: తెలుగు నటి హంసా నందిని జననం
2004: టాలీవుడ్ డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు మరణం
2014: కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణం
News December 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


