News March 28, 2024

ఇచ్చిన టికెట్‌ను లాగేసుకున్నారు: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి ఆవేదన

image

AP: అనపర్తి టికెట్‌ను BJPకి కేటాయించడంతో TDP మాజీ MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఐదేళ్లపాటు రాక్షసులతో యుద్ధం, నాపై 39 అక్రమ కేసులు, 400 మంది కార్యకర్తలపై 180కి పైగా కేసులు, 24/7 ప్రజల కోసమే పోరాటం.. ఇవేమీ కాపాడలేకపోయాయి. మాట మాత్రం చెప్పకుండా ఇచ్చిన టికెట్‌ను లాగేసుకున్నారు. కార్యకర్తలను కాపాడుకోవడానికి ఇవాళ ఉ.9 గంటలకు కఠిన నిర్ణయం తీసుకోబోతున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 13, 2026

ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్!

image

AP: చేనేతలందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు శాసనమండలిలో వెల్లడించారు. చేనేత వృత్తిలో ఉన్న వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640, మర మగ్గం నేతన్నలకు రూ.21,600 ఆదా కానుందని మంత్రి చెప్పారు.

News February 13, 2026

కానిస్టేబుల్‌ సస్పెండ్.. గెలిచిన భార్య!

image

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో సస్పెండైన కానిస్టేబుల్‌ భార్య గెలిచారు. సిద్దిపేట(D) చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో BRS తరఫున గీతాంజలి పోటీ చేశారు. ఆమె భర్త రమేశ్ కొమురవెళ్లి PSలో కానిస్టేబుల్‌. ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు వెళ్లడంతో విధుల నుంచి రమేశ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో గీతాంజలి కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజపై 223 ఓట్ల తేడాతో గెలిచారు.

News February 13, 2026

T20WC: USA భారీ స్కోర్

image

చెన్నై వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో USA చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. ముక్కమల్ల సాయితేజ 79 పరుగులతో సత్తా చాటారు. మరోవైపు శుభమ్ 24 బంతుల్లోనే 48 రన్స్ చేశారు. 3 ఫోర్లు, 2 సిక్సులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 3 వికెట్లు తీశారు.