News April 2, 2024

రూ.4వేల కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం

image

ఏపీ ప్రభుత్వం మార్చి 28న బహిరంగ మార్కెట్‌లో అప్పు తీసుకుంది. ఆర్‌బీఐ వద్ద సెక్యూరిటీలను వేలం వేసి రూ.4వేల కోట్ల రుణం తీసుకుంది. ఏప్రిల్ 2వ తేదీన ఈ నగదు రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు జమ కానుంది. కాగా మే నెల వరకు మరో రూ.9వేల కోట్ల మేర రుణం తీసుకునేందుకు ఆర్బీఐకి ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది.

Similar News

News February 11, 2026

సోషల్ మీడియాలో ఫేక్ AI కంటెంట్.. కేంద్రం కీలక ఆదేశాలు

image

సోషల్ మీడియాలో AI కంటెంట్‌కు SM ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ తొలగింపు విషయంలో కోర్టు/ప్రభుత్వం ఆదేశించిన 3 గంటల్లోగా తొలగించాలని గడువు విధించింది. అంతకుముందు 36 గంటలు గడువు ఉండగా ఈ నెల 20 నుంచి ఈ ఉత్తర్వులు అమలుకానున్నాయి. AI కంటెంట్ దుర్వినియోగంపై యూజర్లకు 3 నెలలకోసారి అవగాహన కల్పించాలని తెలిపింది.

News February 11, 2026

గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

image

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.

News February 11, 2026

ఫిబ్రవరి 11: చరిత్రలో ఈరోజు

image

1847: అమెరికన్ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జననం
1865: తెలుగు సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
1942: బజాజ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు జమ్నాలాల్ బజాజ్ మరణం
1974: సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మరణం (ఫొటోలో)
1977: భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం