News April 27, 2024
T20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక రన్ ఛేజ్

IPLలో రోజుకొక ప్రపంచ రికార్డు బద్దలవుతోంది. నిన్న KKRపై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి పంజాబ్ చరిత్ర సృష్టించింది. T20 క్రికెట్‌లోనే ఇది అత్యధికం. సెకండ్ ఇన్నింగ్సులో హయ్యెస్ట్ స్కోరు కూడా ఇదే. అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన జట్ల(మెన్స్)లో సౌతాఫ్రికా-259(vsవెస్టిండీస్), మిడిలెక్స్-253(vsసర్రే), ఆస్ట్రేలియా-244(vsకివీస్), బల్గేరియా-243(vsసెర్బియా), ముల్తాన్ సుల్తాన్స్-243(vs పెషావర్ జల్మి) ఉన్నాయి.
Similar News
News April 20, 2026
నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల

TG: రైతుభరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తోన్న కర్షకులకు శుభవార్త. నేడు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం భారీ బహిరంగ సభలో బటన్ నొక్కి ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు రూ.5,653 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గత నెల 23న తొలి విడత నిధులు ఇవ్వగా ఇప్పుడు రెండో ఎకరం వరకు నిధులు జమ కానున్నాయి.
News April 20, 2026
ముంబై మళ్లీ గెలుపుబాట పడుతుందా?

IPL: మొదటి మ్యాచ్ తర్వాత మళ్లీ గెలుపు రుచి చూడని ముంబై ఇండియన్స్ ఈరోజు గుజరాత్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న MI ఈ మ్యాచ్‌తోనైనా మళ్లీ గెలుపుబాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో ఉన్న GT అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఈ జట్లు IPLలో ఎనిమిదిసార్లు తలపడగా GT ఐదుసార్లు గెలిచింది. ఈరోజు రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News April 20, 2026
GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా


