News April 14, 2024
జగన్‌పై దాడి ఘటన.. వైసీపీ కీలక ప్రకటన

AP: రాయి దాడిలో గాయపడిన CM జగన్‌కు అర్ధరాత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేశారు. గాయానికి 2 కుట్లు వేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి YCP కీలక ప్రకటన చేసింది. ఎవరూ ఆందోళన చెందవద్దని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని X వేదికగా కోరింది. మరోవైపు జగన్‌పై దాడిని CBN నిజంగానే ఖండించారనుకుంటే టీడీపీ X అకౌంట్ నుంచి ఎందుకు నీచంగా పోస్టులు చేయిస్తున్నారంటూ వైసీపీ మండిపడింది.
Similar News
News December 5, 2025
రాబోయే పది రోజులు తీవ్ర చలి!

TG: రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలో తీవ్ర చలి గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి బలమైన చలి గాలులు ప్రారంభమవుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో రేపటి నుంచి చలి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News December 5, 2025
మీ పిల్లల స్టడీ టేబుల్‌పై ఇవి ఉన్నాయా?

పిల్లలు ఏకాగ్రతగా చదవాలంటే చక్కని స్టడీ టేబుల్ కీలకం. సరైన వెలుతురు ఇచ్చే డెస్క్ ల్యాంప్, పెన్సిల్/పెన్ హోల్డర్ ఫోకస్ పెంచుతాయి. మంచి కొటేషన్లు పిల్లలను మోటివేట్ చేస్తాయి. స్టడీ ప్లానర్ ఉంటే టైమ్ మేనేజ్‌మెంట్ నేర్పుతుంది. వాటర్ బాటిల్ పెట్టుకోవడం మంచిది. ఎక్కువ సౌండ్ చేయని గడియారం టేబుల్‌పై పెట్టుకోండి. ఒక చిన్న మొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
News December 5, 2025
ప్రెగ్నెన్సీలో ఇది ప్రాణాంతకం

బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళకూ పునర్జన్మలాంటిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కాంప్లికేషన్లు వచ్చి ప్రాణాలు కోల్పోతారు. వాటిల్లో ఒకటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం. దీనివల్ల గర్భంలోని ఉమ్మనీరు తల్లి రక్తంలో కలిసిపోతాయి. దీంతో శరీరం ప్రతిస్పందిస్తుంది. దీంతో ఊపిరి ఆడకపోవడం, బీపీ పెరగడం, గుండెకు రక్తసరఫరా ఆగిపోవడం, అధిక రక్తస్రావం జరిగి కొద్ది సమయంలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.


