News April 20, 2024

పొలిటికల్ టర్న్ తీసుకున్న యువతి హత్య

image

కర్ణాటకలో కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నేహా హిరేమఠ్(23) <<13080714>>హత్య<<>> రాజకీయ రంగు పులుముకుంది. ఇది ‘లవ్ జిహాది’ పనేనని కేంద్రమంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను రాష్ట్రమంత్రి, కాంగ్రెస్ నేత పరమేశ్వర కొట్టిపారేశారు. ఫయాజ్‌ను నేహా దూరం పెట్టడంతోనే అతడు చంపేశాడని చెప్పారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించి, నేహాకు న్యాయం చేయాలని తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Similar News

News December 15, 2025

ఒక్క ఓటుతో కొత్తపల్లి సర్పంచ్‌గా గెలిచిన శోభారాణి

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్‌గా గోదరి శోభారాణి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శోభారాణి తన ప్రత్యర్థి ఎల్కతుర్తి కనకలక్ష్మిపై ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. రీకౌంటింగ్ జరిగినా ఒక ఓటు తేడా ఉండడంతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

News December 15, 2025

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష.. చీఫ్ రాజీనామా

image

ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలలో ఒకటైన సౌత్ కొరియా ‘సన్‌అంగ్’ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ఏడాది ఇంగ్లిష్ పేపర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సన్‌అంగ్ చీఫ్ ఓ సుంగ్‌ గియోల్ రాజీనామా చేశారు. ప్రతి ఏడాది నవంబర్‌లో జరిగే ఈ 8 గంటల పరీక్ష వర్సిటీల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తుంది. 1993 నుంచి ఇప్పటివరకు నలుగురు మాత్రమే పూర్తి పదవీకాలం కొనసాగారు.

News December 15, 2025

మూడు దేశాల పర్యటనకు మోదీ

image

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15 నుంచి 18 వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 15-16న జోర్డాన్, 16-17న ఇథియోపియా, 17-18న ఒమన్‌కు ఆయన వెళ్తారు. ‘లింక్ వెస్ట్’ పాలసీ, ‘ఆఫ్రికా ఇనిషియేటివ్‌’లో భాగంగా ఆ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్నారు.