News February 16, 2025

నెక్స్ట్ టార్గెట్ కొడాలి, పేర్ని నానిలే: మంత్రి కొల్లు

image

AP: వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలుపాలు చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ‘నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని, పేర్ని నానిలే. వైసీపీ హయాంలో వీరిద్దరూ అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. వీటిపై విచారణ చేసి వీరిని జైలుకు పంపుతాం’ అని ఆయన హెచ్చరించారు.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. WNPకు 21st Rank

image

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. WNP(D)లో రెగ్యులర్ విద్యార్థులు 4,616 మంది పరీక్షలు రాయగా 3,277 మంది పాసై 70.99%తో స్టేట్‌లో 21వ ర్యాంకు సాధించింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1,009 మందికి 770 మంది పాసై 76.31%తో 11వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 721 మందికి 278 మంది పాసై 38.56%తో 4వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 95 మందికి 54 మంది పాసై 56.84%తో 11వ ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఫలితాలు విడుదల.. నిరాశ వద్దు మిత్రమా!

image

TG: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ ఎలా వచ్చినా నిరాశపడొద్దు. మీ టాలెంట్‌ను, ఫ్యూచర్‌ను పరీక్షలే నిర్ణయిస్తాయి అనుకోవడం పెద్ద తప్పు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. సప్లిమెంటరీ రాసి పడిలేచిన కెరటంలా ముందుకెళ్లాలి. అటు పిల్లలు ఫెయిలైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు అవమానించవద్దు. మీరే అలా చేస్తే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు?
Share It

News April 12, 2026

‘డెకాయిట్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

image

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.28కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. షానియెల్ డియో డైరెక్ట్ చేసిన ఈ మూవీ తొలి రోజు రూ.15కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటించారు. భీమ్స్ సంగీతం అందించారు.