News August 5, 2024
స్టాక్ మార్కెట్ల పతనానికి కారణాలివే..

భారత్‌తో స్నేహ సంబంధాలు కలిగిన ఇజ్రాయెల్, ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్న సంకేతాలు, అమెరికాలో మాంద్యం భయాలు, జపాన్ వడ్డీ రేట్ల పెంపు సహా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. BSEలోని సంస్థల విలువలో రూ.14 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.
Similar News
News December 15, 2025
త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన: మహేశ్ గౌడ్

TG: త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. మంత్రుల మార్పు, చేర్పుపై తనకు స్పష్టత లేదని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్, అధిష్ఠానం మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు నల్లేరుపై నడక అని చెప్పారు.
News December 15, 2025
నరసాపురం వరకు వందేభారత్.. నేడే ప్రారంభం

AP: చెన్నై సెంట్రల్-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నేటి నుంచి నరసాపురం వరకు నడవనుంది. ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నరసాపురం రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి చెన్నై వెళ్లే రైలును ప్రారంభిస్తారు. షెడ్యూల్.. చెన్నై నుంచి రైలు(20677) 5.30AMకు బయలుదేరి 11.45AMకు విజయవాడ వస్తుంది. గుడివాడ, భీమవరం మీదుగా 2.10PMకు నరసాపురం చేరుకుంటుంది. తిరిగి ట్రైన్(20678) 2.50PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.
News December 15, 2025
ఆవుండగా గాడిద పాలు పితికినట్లు

ఒక పనిని సులభంగా, సరైన మార్గంలో చేసే అవకాశం లేదా వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిని విస్మరించి, కష్టమైన, పనికిరాని, అసాధ్యమైన మార్గాన్ని ఎంచుకున్న సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అందుబాటులో ఉన్న మంచి అవకాశాన్ని వదులుకుని అనవసరమైన శ్రమకు పోవడాన్ని ఈ సామెత సూచిస్తుంది.


