News April 25, 2024

ఠారెత్తిస్తున్న ఎండలు.. కారణమిదే!

image

వేసవి మండిపోతోంది. బయటికెళ్తే చాలు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెలలో పరిస్థితేంటోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఎండలు మండిపోతాయని ఐక్యరాజ్యసమతి వాతావరణ విభాగం ముందే చెప్పింది. గత ఏడాది మొదలైన ఎల్‌నినోయే దీనిక్కారణమని వివరించింది. ‘పసిఫిక్’పై ఉష్ణోగ్రతలు పెరగడమే ఎల్‌నినో. అయితే, మే చివరికల్లా వానలు వచ్చేస్తాయని నిపుణులు చెబుతుండటం కొంచెం ఊరటనిచ్చే అంశం.

Similar News

News April 14, 2026

అభి‘షేక్’ చేస్తాడనుకుంటే.. సున్నాల్లో రికార్డ్

image

హిట్టర్ అభిషేక్ శర్మ‌కు ఈ ఏడాది కలిసి రావట్లేదు. షేక్ చేస్తాడనుకుంటే ఇటీవల T20WC, ప్రస్తుతం ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతూ అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. ఈ క్రమంలో T20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక <<19642127>>డకౌట్స్<<>>(18 ఇన్నింగ్సుల్లో ఏడుసార్లు) అయిన ఇండియన్ ప్లేయర్‌గా చెత్త రికార్డు నమోదు చేశారు. రోహిత్ 2018లో, సంజూ శాంసన్ 2024లో 32 ఇన్నింగ్సుల్లో ఆరుసార్లు సున్నాకు ఔటయ్యారు.

News April 14, 2026

IEBలో 28 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఇండియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంక్‌(IEB), ముంబైలో 28 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వీటిలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ-22, డిప్యూటీ మేనేజర్-5, చీఫ్‌ మేనేజర్‌-1 పోస్టులున్నాయి. 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, LLB/BE/B.Tech/PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం www.eximbankindia.in చూడండి.

News April 14, 2026

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే?

image

గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన ‘OG’ సినిమా పార్ట్-2 పనులు మొదలైనట్లు సమాచారం. ఇందులో పవర్ స్టార్ మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్ మరో లెవెల్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఓజస్ గంభీర-ర్యాంపేజ్ బిగిన్స్’ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తాయని టాక్. పవన్ డేట్స్‌ను బట్టి షూటింగ్ మొదలవుతుందట.