News April 24, 2024
రెండో దశ ఎన్నికలు.. స్వల్పంగా పెరిగిన మహిళా అభ్యర్థులు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ఈ నెల 26న జరగనుంది. 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశతో పోలిస్తే సెకండ్ ఫేజ్‌లో పోటీ చేసే మహిళా అభ్యర్థులు కాస్త పెరిగారు. తొలి దశలో 102 స్థానాలకు 1,625 మంది పోటీ చేయగా 134(8.2%) మంది మహిళలున్నారు. ఈసారి 1198 మంది బరిలో ఉండగా వీరిలో 103(8.6%) మంది మహిళలు పోటీలో నిలిచారు.<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 13, 2025
కస్టమ్స్ కమిషనర్ ఆఫీస్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

కోచిలోని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆఫీస్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ట్రేడ్స్‌మన్, సీమ్యాన్, గ్రేసర్, సీనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. సీనియర్ స్టోర్ కీపర్ పోస్టుకు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: taxinformation.cbic.gov.in/
News December 13, 2025
పేరు మార్పుతో ప్రయోజనం ఏంటి: ప్రియాంకా గాంధీ

ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా మార్చాలన్న <<18543899>>కేంద్ర నిర్ణయం<<>>పై కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వలన ఏ ప్రయోజనం ఉంటుందో అర్థం కావడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులతో పాటు పత్రాలలో పేరు మార్చాల్సి రావడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఖర్చవుతుందని పేర్కొన్నారు. అనవసర వ్యయంతో ప్రజలకు లాభం ఏమిటని ప్రశ్నించారు.
News December 13, 2025
రెండు రోజుల్లో బుల్లెట్ నేర్చుకున్న బామ్మ

వయసులో ఉన్న అమ్మాయిలే బుల్లెట్ బండి నడపాలంటే అమ్మో అంటారు. కానీ చెన్నైకి చెందిన 60 ఏళ్ల లతా శ్రీనివాసన్ రెండు రోజుల్లో బుల్లెట్ బండి నడిపి ఔరా అనిపించారు. రిటైర్మెంట్ తర్వాత తనకిష్టమైన బైక్ రైడింగ్ నేర్చుకోవాలనుకున్న లత ఒక అకాడమీలో చేరారు. అక్కడ మొదటి రోజు క్లచ్.. గేర్ మార్చడం నేర్చుకుంది. రెండో రోజునే సెకండ్.. థర్డ్ గేర్‌లో స్మూత్‌గా బైక్ నడపడం మొదలుపెట్టి ట్రెండ్ సెట్టర్‌గా మారారు.


