News April 1, 2024

జ్ఞానవాపిలో పూజలపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు

image

జ్ఞానవాపి మసీదులో పూజలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే హిందువులు చేసే పూజలు మసీదు సెల్లార్ ప్రాంతానికే పరిమితం కావాలని ఆదేశించింది. ముస్లిములు ఉత్తర ప్రాంతంలో తమ ప్రార్థనలను యథావిధిగా కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా అంతకుముందు మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల ప్రాంతంలో సర్వేపై స్టే విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Similar News

News February 19, 2026

ట్రంప్ ఆదేశమే ఆలస్యం.. ఇరాన్‌పై దాడికి US ఆర్మీ సిద్ధం: CNN

image

ఇరాన్‌పై దాడి చేసేందుకు అమెరికా మిలిటరీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ వీకెండ్‌లోనే అటాక్ చేసే ఛాన్స్ ఉందని CNN తెలిపింది. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మిడిల్ ఈస్ట్‌లో US తన అతిపెద్ద ఎయిర్ పవర్‌ను మోహరించినట్లు పేర్కొంది. ట్రంప్ తన అడ్వైజర్లతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్‌గా ఈ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News February 19, 2026

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 43 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (<>ISI<<>>) కోల్‌కతాలో 43 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల వారు FEB 21 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ ఆఫీసర్, ఎలక్ట్రీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, AICWA, MBA,డిప్లొమా, ఐటీఐ, టెన్త్, ఇంటర్, ఎనిమిదో తరగతి+ITI అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: www.isical.ac.in

News February 19, 2026

వరి మాగాణి మినుములో ఎండు తెగులు

image

ఎండు తెగులు ఆశించిన మినుము మొక్కలు వడలి, ఎండి పంటకు నష్టం వాటిల్లుతుంది. భూమిలోని శిలీంధ్రం ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు పంట మార్పిడితో పాటు పొలంలో నీరు నిల్వలేకుండా చూడాలి. పైరు విత్తే ముందు kg విత్తనానికి 3గ్రా. కార్బెండజిమ్ పట్టించి విత్తాలి. ఎకరాకు 80kgల చివికిన పశువుల ఎరువు+20kgల వేపపిండిలో 2kgల ట్రైకోడెర్మావిరిడె జీవశిలీంధ్రాన్ని కలిపి విత్తే సమయంలో భూమిలో కలియదున్నుకోవాలి.