News April 20, 2024
టార్గెట్ 300! ఇవాళ కొట్టేస్తారా?

ఈ ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు రెచ్చిపోయి ఆడుతోంది. ఆ టీమ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. 11ఏళ్ల పాటు నిలిచిన ఐపీఎల్ అత్యధిక స్కోరు (263) రికార్డును ముంబైతో మ్యాచ్‌లో 277 రన్స్‌తో SRH చెరిపివేసింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో తన రికార్డును తానే బద్దలు కొడుతూ 287 రన్స్ చేసింది. ఇక ఆ టీమ్ తర్వాతి టార్గెట్ 300 రన్స్ కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో ఆ ఘనత సాధిస్తారేమో చూడాలి.
Similar News
News December 14, 2025
54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ 54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/ బీటెక్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. GATE-2025 స్కోరు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.56,100-రూ.1,77,500 వరకు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300. వెబ్‌సైట్: https://www.dvc.gov.in
News December 14, 2025
వరి చేనులో జింకు లోపాన్ని ఎలా గుర్తించాలి?

వరి పంట పెరుగుదల, దిగుబడిలో జింకు సూక్ష్మపోషకం కీలక పాత్ర పోషిస్తుంది. వరి విత్తనం మొలకెత్తిన దశ నుంచి చివరి వరకూ జింకు అవసరం. ముఖ్యంగా చిరు పొట్ట దశలో జింకు అవసరం ఎక్కువగా ఉంటుంది. జింకు లోపం వచ్చిన వరి పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా వస్తాయి. అంతేకాకుండా వచ్చిన వరి పిలకలు సరిగా పెరగవు. దీంతో పైరు ఎదగకుండా గిడసబారి కనిపిస్తుంది. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు ఎదుగుదలలో మార్పు కనిపించదు.
News December 14, 2025
KCRకి ఉన్న చరిష్మా వాళ్లెవరికీ లేదు: టీపీసీసీ చీఫ్

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. ‘KCRకి ఉన్న చరిష్మా వాళ్ల కుటుంబంలో ఎవరికీ లేదు. పార్టీని నడపడం KTR వల్ల కాదు. BRSను హరీశ్ చీల్చుతాడు. ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటే కవిత ఎందుకు బయటకొస్తుంది. KTR డబ్బులు పెట్టి సోషల్ మీడియాతో నడిపిస్తున్నాడు’ అని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. CBN పెట్టుబడులు పెట్టాలని ఎంత ప్రచారం చేసినా ఇన్వెస్టర్లు HYD వైపే చూస్తున్నారని అన్నారు.


