News March 26, 2024

ఫోన్ ట్యాపింగ్‌కు అప్పటి సీఎం బాధ్యులు: కిషన్ రెడ్డి

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా తీవ్రమైనది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌కు అప్పటి ముఖ్యమంత్రే బాధ్యులు. బీజేపీ ఆఫీసు సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారు’ అని ఆయన ఆరోపించారు.

Similar News

News February 18, 2026

టెన్త్ అర్హతతో 28,636 ఉద్యోగాలు.. BIG UPDATE

image

ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 28,636 GDS పోస్టులకు ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీటిలో TGలో 608, APలో 1060 ఖాళీలున్నాయి. తాజాగా అప్లికేషన్ల సవరణకు అవకాశం కల్పిస్తూ పోస్టల్ శాఖ కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది. అభ్యర్థులు రేపు సా.5 గంటల వరకు దరఖాస్తులను <>https://www.indiapost.gov.in/<<>> సైట్‌లో ఎడిట్ చేసుకోవచ్చు.

News February 18, 2026

అంబటికి బెయిల్

image

AP: YCP నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీడ్రా పేరిట మోసం చేశారంటూ ఆయనపై సత్తెనపల్లి పీఎస్‌లో కేసు నమోదైైంది. అంబటిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా CBNను దూషించిన కేసు, పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది. అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News February 18, 2026

కూరగాయలు తాజాగా ఉండాలంటే?

image

కూరగాయలు తాజాగా ఉండటానికి జపనీయులు కాటన్, మస్లిన్ వస్త్రంలో చుట్టేస్తారు. ఆకుకూరలను కాస్త తడిపిన క్లాత్‌లో చుట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. అలాగే ఫ్రిడ్జ్‌లో కూరగాయలు పెట్టాలి అనుకున్నప్పుడు వాటిని శుభ్రంగా కడిగి, తుడిచి పొడిగా ఉన్నప్పుడే పెట్టాలి. పండిపోయినవి త్వరగా వాడేయాలి. లేదంటే వాటి ప్రభావం వేరే కూరగాయలపై పడుతుంది. అలాగే టైట్‌ కవర్‌లో కూరగాయలు పెట్టడం వల్ల తర్వరగా పాడైపోతాయి.