News April 27, 2024

దేశమంతా నా ఎంట్రీ కోరుకుంటోంది: వాద్రా

image

ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త, రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దేశమంతా తన పొలిటికల్ ఎంట్రీ కోరుకుంటోంది. నేను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉన్నాను. అమేథీలో అయితే 1999 నుంచి ప్రచారం చేస్తున్నాను. ప్రస్తుత ఎంపీ స్మృతి ఇరానీ తన హామీలను నెరవేర్చలేదు. గాంధీ కుటుంబానికి దేశం అండగా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా గతంలోనూ అమేథీ సీటు నుంచి పోటీ చేయడంపై వాద్రా ఆసక్తి కనబరిచారు.

Similar News

News April 12, 2026

ఫలితాలు విడుదల.. నిరాశ వద్దు మిత్రమా!

image

TG: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ ఎలా వచ్చినా నిరాశపడొద్దు. మీ టాలెంట్‌ను, ఫ్యూచర్‌ను పరీక్షలే నిర్ణయిస్తాయి అనుకోవడం పెద్ద తప్పు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. సప్లిమెంటరీ రాసి పడిలేచిన కెరటంలా ముందుకెళ్లాలి. అటు పిల్లలు ఫెయిలైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు అవమానించవద్దు. మీరే అలా చేస్తే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు?
Share It

News April 12, 2026

‘డెకాయిట్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

image

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.28కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. షానియెల్ డియో డైరెక్ట్ చేసిన ఈ మూవీ తొలి రోజు రూ.15కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటించారు. భీమ్స్ సంగీతం అందించారు.

News April 12, 2026

ఇంటర్‌: భయంతో ఆత్మహత్య.. కానీ పాసయ్యాడు!

image

TG: ఖమ్మం జిల్లాలో విషాదం జరిగింది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో రాపల్లికి చెందిన ఇంటర్ MPC ఫస్టియర్ విద్యార్థి అక్షంత్ గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇవాళ వెలువడ్డ ఫలితాల్లో అతడు 347 మార్కులతో అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యాడు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
*జీవితం మహాసముద్రం లాంటిది. మార్కులు మాత్రమే మీ భవిష్యత్‌ను నిర్ణయించవు.