News April 1, 2024

అమెరికా అధ్యక్షుడి విమానంలోనే చోరీలు..!

image

కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్షుడి విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ నుంచి పలు వస్తువులు చోరీకి గురవ్వడం భద్రతా సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. తీరా దర్యాప్తు చేస్తే ఆ చోరులు మీడియా వారే అని తేలింది. తాము ఆ విమానంలో ప్రయాణించామని చెప్పుకొనేందుకు వస్తువుల్ని దొంగిలిస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో అలా తీసుకెళ్లొద్దని, కావాలంటే విమానంలో దిగిన ఫొటోలను ఇస్తామని విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 12, 2026

రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రేషన్ కార్డులు లేని అర్హులైన వ్యక్తులు ‘మీ సేవ’ కేంద్రాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అలాగే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చవచ్చని తెలిపింది. గత ఏడాది కాలంలో 14.40 లక్షల కొత్త కార్డులు మంజూరయ్యాయని వెల్లడించింది. కాగా 2026 JANకి మొత్తం కార్డుల సంఖ్య 1,04,35,848కు చేరాయంది.

News February 12, 2026

₹10లక్షలు చెల్లించాలి; ధోనీకి HC ఆదేశం.. కారణమిదే!

image

MS ధోనీ గతంలో వేసిన పరువు నష్టం దావా కేసును విచారించేందుకు వీడియోలను డాక్యుమెంట్లుగా మార్చేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.10లక్షలు చెల్లించాలని మద్రాస్ కోర్టు ఆదేశించింది. 2013 IPL ఫిక్సింగ్‌లో ధోనీ హస్తం ఉందని Ex IPS జి.సంపత్ కుమార్, మరికొందరు ఆరోపణలు చేశారు. దీంతో ₹100 కోట్లకు ధోనీ పరువునష్టం దావా వేశారు. 2025 ఆగస్టులో కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు ఇచ్చింది.

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘మహాదేవ’’

image

ముక్కోటి దేవతలలో శివుడి స్థానం అత్యున్నతమైనది. సృష్టి, స్థితి, లయ కారకులలో ఆయన లయకారుడైనప్పటికీ, జ్ఞానానికి ఆయనే మూలం. దేవతలకు, అసురులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు, సృష్టికి ప్రమాదం వాటిల్లినప్పుడు దేవతలందరూ శివుడినే శరణు కోరుతారు. బ్రహ్మ, విష్ణువుల వంటి వారికే ఆదిగురువుగా నిలిచిన దేవుడు శివుడు. దేవతలకు సైతం దేవుడు కాబట్టి ఆయనను ‘మహాదేవుడు’ అని పిలుస్తారు. అంటే దేవుళ్లందరిలో గొప్పవాడు అని అర్థం.