News March 28, 2024
అప్పుడు వార్నర్.. ఇప్పుడు క్లాసెన్

క్లాసెన్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ ప్లేయర్. IPLలో చాలా సీజన్ల పాటు అలరించిన వార్నర్‌ను SRH వదులుకోవడంతో అలాంటి ఆటగాడి కోసం అభిమానులు ఎదురుచూశారు. వారి ఆశలను నెరవేరుస్తూ తాను ఉన్నానంటూ క్లాసెన్ ముందుకొచ్చారు. ఎవరు ఆడినా, ఆడకున్నా తాను మాత్రం అద్భుతమైన షాట్లతో భారీ స్కోర్లు చేస్తున్నారు. గత సీజన్లోనూ ఒంటరి పోరాటం చేశారు. ప్రస్తుతం టీ20ల్లో తానే బెస్ట్ ప్లేయర్‌నని నిరూపించుకుంటున్నారు.
Similar News
News February 16, 2026
క్షేత్రపాలకుడు అంటే ఎవరు?

ఆలయం, గ్రామాన్ని రక్షిస్తాడు. ఆయన శివుని వెయ్యో అంశగా ఉద్భవించిన స్వామిగా చెబుతారు. శైవ, వైష్ణవ క్షేత్రాలలో రక్షకుడిగా ఉంటారు. తిరుమలలో రుద్రశిల, కాశీలో కాలభైరవుడు, పంచారామాల్లో జనార్దన స్వామి.. క్షేత్రపాలకులుగా కొలువై ఉన్నారు. భక్తులు, అర్చకులు ఆలయ ప్రవేశానికి ముందు ఈయన అనుమతి తీసుకోవడం సంప్రదాయం. ఈ స్వామిని దర్శించుకుంటే క్షేత్ర దర్శన ఫలం లభిస్తుందని, దుష్టశక్తుల నుంచి రక్షణ కలుగుతుందని నమ్మకం.
News February 16, 2026
పత్తిలో కలుపు సమస్య- నివారణకు సూచనలు

☛ పత్తి మొలకెత్తిన నెల రోజులకు కలుపు కనిపిస్తే క్విజలాఫాప్ ఇథైల్ 400ML లేదా ప్రోఫాక్విజఫాప్ 250ML, పైరిథయోబాక్ సోడియం 250ML 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ☛ ప్రతి పది రోజులకొకసారి గొర్రు, గుంటకలతో అంతరకృషి చేయాలి. కలుపును ఏరివేయాలి. ☛ వర్షాలు ఎక్కువగా ఉండి కలుపు తీయడం కుదరకపోతే పారాక్వాట్ 5ML+ 10గ్రా. యూరియాతో లీటరు నీటికి కలిపి పత్తి మొక్కలపై పడకుండా వరుసల మధ్య మాత్రమే పిచికారీ చేయాలి.
News February 16, 2026
జేఈఈ మెయిన్ ఫైనల్ కీ రిలీజ్

జేఈఈ మెయిన్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్‌లో NTA ఫైనల్ కీ రిలీజ్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న ఫలితాలు రిలీజ్ కావాల్సి ఉండగా ఇవాళ వెల్లడిస్తామని 4రోజుల కిందట అప్డేట్ ఇచ్చింది. తాజాగా కీ విడుదల కాగా ఏ క్షణంలోనైనా ఫలితాలు వెల్లడయ్యే ఛాన్సుంది.


