News October 7, 2025

ఆ స్కూళ్లల్లో 40లోపే విద్యార్థులు.. త్వరలో టీచర్ల సర్దుబాటు!

image

AP: విద్యార్థుల సంఖ్య 40లోపు ఉన్న ఎయిడెడ్ స్కూళ్లు రాష్ట్రంలో 251 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా ప్రకాశంలో 35, గుంటూరులో 29, బాపట్ల 26, కడప 18 స్కూళ్లు, అత్యల్పంగా అనకాపల్లి, కర్నూలులో 2 చొప్పున ఉన్నాయి. ఈ స్కూళ్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ఈ పాఠశాలల్లో పని చేసే మిగులు ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేయనున్నారు.

Similar News

News January 12, 2026

కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాదు: SC

image

కాంట్రాక్టు సిబ్బంది, ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాదని SC స్పష్టం చేసింది. ‘రెగ్యులర్ ఉద్యోగులతో సమాన స్థాయిని వారు కోరలేరు. వారి మధ్య వ్యత్యాసాన్ని తీసేస్తే ప్రభుత్వంలో నియామకాల ఉద్దేశం దెబ్బతింటుంది’ అని పేర్కొంది. నంద్యాల(AP) మున్సిపాల్టీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా మానవతా దృష్టితో వీరిని రెగ్యులర్ చేసే అవకాశాలను చూడాలని సూచించింది.

News January 12, 2026

మున్సిపల్ ఎన్నికలు.. మొత్తం 51.92 లక్షల మంది ఓటర్లు

image

TG: మున్సిపాలిటీల్లోని తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో మొత్తం 51,92,220 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 25,37,136 మంది పురుషులు, 26,54,453 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 631 మంది ఇతర ఓటర్లున్నట్లు తుది జాబితాలో వెల్లడించింది. కాగా ఈ నెల 17న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

News January 12, 2026

ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

image

WPL-2026లో ఆర్సీబీ ముందు యూపీ వారియర్స్ 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. RCB బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యూపీ ఓపెనర్లు లానింగ్(14), హర్లీన్(11) పరుగులు రాబట్టేందుకు తడబడ్డారు. లిచ్‌ఫీల్డ్(20), కిరణ్(5) విఫలమవ్వగా ఆల్‌రౌండర్లు దీప్తి(45*), డాటిన్(40*) ఆరో వికెట్‌కు 93 పరుగులు జోడించడంతో UP 20 ఓవర్లలో 143/5 స్కోరు చేసింది. RCB బౌలర్లలో నాడిన్, శ్రేయాంక చెరో 2, లారెన్ ఒక వికెట్ తీశారు.